వెంగెమాడేనా నిన్ను వినవా నాజాడ మున్ను
(॥పల్లవి॥)
వెంగెమాడేనా నిన్ను వినవా నాజాడ మున్ను
సంగతిగా బుద్దిచెప్పి చవివుట్టించేఁగాక
(॥వెంగె॥)
అందమాయ నీమాటలు ఆపెతో మొగమోటలు
పొందుసేసే వప్పటిని పూఁటవూఁటలు
నిందలాడేమా నేము నీవిట్టె చూచేవు మోము
విందులుగా నీసుద్దులు విన్నవించేఁగాక
(॥వెంగె ॥)
తొలఁకీ మోవినవ్వులు తురుము నిండెఁబువ్వులు
యెలమి నింకానేల యెడదవ్వులు
చలము నీపై లేదు సరవిఁ జెప్పకపోదు
వలపు సూడిదెవట్టి వాసిరేఁచేఁ గాక
(॥వెంగె॥)
కంటిమి నీచేఁతలు కరుణ కివె పూఁతలు
దంటతనములకు యీఁతలు మోఁతలు
ఇంటనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నంటున నీవిచ్చినమన్నన చూపేఁగాక
(||pallavi||)
vĕṁgĕmāḍenā ninnu vinavā nājāḍa munnu
saṁgadigā buddisĕppi savivuṭṭiṁchem̐gāga
(||vĕṁgĕ||)
aṁdamāya nīmāḍalu ābĕdo mŏgamoḍalu
pŏṁdusese vappaḍini pūm̐ṭavūm̐ṭalu
niṁdalāḍemā nemu nīviṭṭĕ sūsevu momu
viṁdulugā nīsuddulu vinnaviṁchem̐gāga
(||vĕṁgĕ ||)
tŏlam̐kī movinavvulu turumu niṁḍĕm̐buvvulu
yĕlami niṁkānela yĕḍadavvulu
salamu nībai ledu saravim̐ jĕppagabodu
valabu sūḍidĕvaṭṭi vāsirem̐sem̐ gāga
(||vĕṁgĕ||)
kaṁṭimi nīsem̐talu karuṇa kivĕ pūm̐talu
daṁṭadanamulagu yīm̐talu mom̐talu
iṁṭanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
naṁṭuna nīvichchinamannana sūbem̐gāga