Vemgemaadenaa ninnu veginamtaanu

వెంగెమాడేనా నిన్ను వేగినంతాను
Language

(॥పల్లవి॥)
వెంగెమాడేనా నిన్ను వేగినంతాను
సంగతిగా మొదల నిచ్చకురాల నేను

(॥వెంగె॥)
పగచాటేనా నీతోఁ బక్కన నవ్వేఁగాక
యెగసక్కేలు నీవు యెంతసేసినా
తెగనాడేనా నీవే దేవరవనేఁగాక
సగటున నీమోవి పచ్చియై వుండినను

(॥వెంగె॥)
కోపగించేనా నిన్ను గుట్టున మెచ్చేఁగాక
మాపుదాఁకా నీవెంత మట్టుమీరినా
రాఁపుసేసేనా నిన్ను రసికుఁడవనేఁగాక
తోపునూకుడుగ నెంతదూరు నీపై నుండినా

(॥వెంగె॥)
బొమ్మల జంకించేనా పొగడుచు నుండేఁగాక
దిమ్మరివై నీవెటు దిరిగినను
యెమ్మెలెంచేనా శ్రీవేంకటేశుఁడ వనేఁగాక
సమ్మతించి నన్నుఁగూడి సదమదమైనను

(||pallavi||)
vĕṁgĕmāḍenā ninnu veginaṁtānu
saṁgadigā mŏdala nichchagurāla nenu

(||vĕṁgĕ||)
pagasāḍenā nīdom̐ bakkana navvem̐gāga
yĕgasakkelu nīvu yĕṁtasesinā
tĕganāḍenā nīve devaravanem̐gāga
sagaḍuna nīmovi pachchiyai vuṁḍinanu

(||vĕṁgĕ||)
kobagiṁchenā ninnu guṭṭuna mĕchchem̐gāga
mābudām̐kā nīvĕṁta maṭṭumīrinā
rām̐pusesenā ninnu rasigum̐ḍavanem̐gāga
tobunūguḍuga nĕṁtadūru nībai nuṁḍinā

(||vĕṁgĕ||)
bŏmmala jaṁkiṁchenā pŏgaḍusu nuṁḍem̐gāga
dimmarivai nīvĕḍu diriginanu
yĕmmĕlĕṁchenā śhrīveṁkaḍeśhum̐ḍa vanem̐gāga
sammadiṁchi nannum̐gūḍi sadamadamainanu