Vemgemaadam baniledu vesa nogarogarigi

వెంగెమాడఁ బనిలేదు వెస నొకరొకరికి
Language

(॥పల్లవి॥)
వెంగెమాడఁ బనిలేదు వెస నొకరొకరికి
సంగతాయ నీ పొందు జమళి నిద్దరికి

(॥వెంగె॥)
పొత్తులఁ గుండి యాపె వూఁచి చేతికియ్యఁగా
ఇత్తల వందిచ్చేవు ఇదివో నాకు
బత్తి నీవు నాపైని పడఁతికి నీ మీఁదను
హత్తి వున్న విద్దరిపుణ్యములు మంచివే

(॥వెంగె॥)
ఆకె దనతొడమీఁద నటు నిన్నుంచుకొనఁగ -
నీ కడ నీతొడపై నన్నిడుకొంటివి
నీకు నేను ప్రియమైతి నీ వాపెకు బాఁతైతివి
పైకొని ఇద్దరి తపః ఫలములు మంచివే

(॥వెంగె॥)
వెలినుండి వచ్చి యాకె వేడుక నిన్నుఁ గూడితే -
నలమేల్మంగనైన నన్నలమితివి
వలతువు నీవు నాకు వనిత నీకు మోహించె
యెలమి శ్రీవేంకటేశ యీరెండు మంచివే

(||pallavi||)
vĕṁgĕmāḍam̐ baniledu vĕsa nŏgarŏgarigi
saṁgadāya nī pŏṁdu jamaḽi niddarigi

(||vĕṁgĕ||)
pŏttulam̐ guṁḍi yābĕ vūm̐si sedigiyyam̐gā
ittala vaṁdichchevu idivo nāgu
batti nīvu nābaini paḍam̐tigi nī mīm̐danu
hatti vunna viddaribuṇyamulu maṁchive

(||vĕṁgĕ||)
āgĕ danadŏḍamīm̐da naḍu ninnuṁchugŏnam̐ga -
nī kaḍa nīdŏḍabai nanniḍugŏṁṭivi
nīgu nenu priyamaidi nī vābĕgu bām̐taidivi
paigŏni iddari tabaḥ phalamulu maṁchive

(||vĕṁgĕ||)
vĕlinuṁḍi vachchi yāgĕ veḍuga ninnum̐ gūḍide -
nalamelmaṁganaina nannalamidivi
valaduvu nīvu nāgu vanida nīgu mohiṁchĕ
yĕlami śhrīveṁkaḍeśha yīrĕṁḍu maṁchive