Vemgemaada nemta ledu veginamtaanu

వెంగెమాడ నెంత లేదు వేగినంతాను
Language

(॥పల్లవి॥)
వెంగెమాడ నెంత లేదు వేగినంతాను
అంగవించి మఱచేవా అంతటి నా వలపు

(॥వెంగె॥)
సాదించ నెంత లేదు జంకెనబొమ్మల నిన్ను
సోదించనెంతలేదు చొప్పు నీమేన
కాదనము రావయ్య కడ నీ వెందుండినాను
పాదుకొని మఱచేవా బత్తితో నావలపు

(॥వెంగె॥)
నవ్వు నవ్వ నెంత లేదు నాలిసేసి విన్నిపుడు
రవ్వసేయ నెంత లేదు రమణులతో
రువ్వి తిట్టము రావయ్య రుచు లెందు చూచినాను
చివ్వనను మఱచేవా సేవతో నావలపు

(॥వెంగె॥)
అలయించ నెంత లేదు అట్టె రతుల నిన్ను
వెలయించ నెంత లేదు వేడుకతోడ
సొలయము రావయ్య సొంపగు శ్రీవేంకటేశ
కలసితి మఱచేవా కందువనావలపు

(||pallavi||)
vĕṁgĕmāḍa nĕṁta ledu veginaṁtānu
aṁgaviṁchi maṟasevā aṁtaḍi nā valabu

(||vĕṁgĕ||)
sādiṁcha nĕṁta ledu jaṁkĕnabŏmmala ninnu
sodiṁchanĕṁtaledu sŏppu nīmena
kādanamu rāvayya kaḍa nī vĕṁduṁḍinānu
pādugŏni maṟasevā battido nāvalabu

(||vĕṁgĕ||)
navvu navva nĕṁta ledu nālisesi vinnibuḍu
ravvaseya nĕṁta ledu ramaṇulado
ruvvi tiṭṭamu rāvayya rusu lĕṁdu sūsinānu
sivvananu maṟasevā sevado nāvalabu

(||vĕṁgĕ||)
alayiṁcha nĕṁta ledu aṭṭĕ radula ninnu
vĕlayiṁcha nĕṁta ledu veḍugadoḍa
sŏlayamu rāvayya sŏṁpagu śhrīveṁkaḍeśha
kalasidi maṟasevā kaṁduvanāvalabu