వేఁడుకొని వేఁడుకొని వేసారితి మిద్దరిని
(॥పల్లవి॥)
వేఁడుకొని వేఁడుకొని వేసారితి మిద్దరిని
నేఁడు గరుణించఁడొకొ నేరుపుల మరుఁడు
(॥॥)
చెక్కు లెంతనొక్కినాను సేవ లెంతచేసినాను
మక్కువ గలుగుదాఁ కా మన సొగ్గుదు
మొక్కులెన్ని మొక్కినానుముచ్చటలెంతాడినాను
అక్కర గలుగుదాఁ కా నందవు పొందికలు
(॥॥)
సన్నలెన్ని చేసినాను చవులెన్ని పుట్టించినా
యెన్నిక లొనరుదాఁ కా నింపు వుట్టదు
విన్నప మెంతసేసినా వేడుక లెంతచూపినా
కన్నుల కింపవుదాఁకా కలుగదు ప్రియము
(॥॥)
కతలెన్ని చెప్పినాను కప్పుర మెంతిచ్చినాను
రతి సమకొనుదాఁకా రాఁపు మానదు
ఇతవై శ్రీ వేంకటేశుఁ డింతియును నెనసిరి
పతివచ్చునందాఁ కాఁ దప్పవు పంతములు
(||pallavi||)
vem̐ḍugŏni vem̐ḍugŏni vesāridi middarini
nem̐ḍu garuṇiṁcham̐ḍŏgŏ nerubula marum̐ḍu
(||||)
sĕkku lĕṁtanŏkkinānu seva lĕṁtasesinānu
makkuva galugudām̐ kā mana sŏggudu
mŏkkulĕnni mŏkkinānumuchchaḍalĕṁtāḍinānu
akkara galugudām̐ kā naṁdavu pŏṁdigalu
(||||)
sannalĕnni sesinānu savulĕnni puṭṭiṁchinā
yĕnniga lŏnarudām̐ kā niṁpu vuṭṭadu
vinnaba mĕṁtasesinā veḍuga lĕṁtasūbinā
kannula kiṁpavudām̐kā kalugadu priyamu
(||||)
kadalĕnni sĕppinānu kappura mĕṁtichchinānu
radi samagŏnudām̐kā rām̐pu mānadu
idavai śhrī veṁkaḍeśhum̐ ḍiṁtiyunu nĕnasiri
padivachchunaṁdām̐ kām̐ dappavu paṁtamulu