Vemdugonavayyaa yeebe vellaviri seyagumdaa

వేఁడుకొనవయ్యా యీపె వెల్లవిరి సేయకుండా
Language

(॥పల్లవి॥)
వేఁడుకొనవయ్యా యీపె వెల్లవిరి సేయకుండా
ఆఁడుదాని కెంత పంతమైనా నియ్యవచ్చును

(॥వేఁడు॥)
కొలువులోఁ దప్పక యేకొమ్మనో చూచితివంటా
కలకల నవ్వి యీకె కాకు సేసీని
మలసి యందుకు నేము మాట మరపించితే
చలపాదితనాన సాదించీని

(॥వేఁడు॥)
సంగడి రాఁగా నెవ్వతచన్నులో తాఁకితివంటా
పంగించి యాపె నిన్నుఁ బచ్చిసేసీని
సంగతి గాదని నేము చాయ సేకుండితేను
అంగడి వేసి తానే ఆన వెట్టుకొనీని

(॥వేఁడు॥)
గందమిచ్చేయాపెనేమో కాఁగిలించుకొంటివంటా
నిందవేసి యాపె నిన్ను నేరమెంచీని
యిందుకే శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అంది నన్ను నేలితివి అప్పటిఁ దావచ్చీని

(||pallavi||)
vem̐ḍugŏnavayyā yībĕ vĕllaviri seyaguṁḍā
ām̐ḍudāni kĕṁta paṁtamainā niyyavachchunu

(||vem̐ḍu||)
kŏluvulom̐ dappaga yegŏmmano sūsidivaṁṭā
kalagala navvi yīgĕ kāgu sesīni
malasi yaṁdugu nemu māḍa marabiṁchide
salabādidanāna sādiṁchīni

(||vem̐ḍu||)
saṁgaḍi rām̐gā nĕvvadasannulo tām̐kidivaṁṭā
paṁgiṁchi yābĕ ninnum̐ bachchisesīni
saṁgadi gādani nemu sāya seguṁḍidenu
aṁgaḍi vesi tāne āna vĕṭṭugŏnīni

(||vem̐ḍu||)
gaṁdamichcheyābĕnemo kām̐giliṁchugŏṁṭivaṁṭā
niṁdavesi yābĕ ninnu neramĕṁchīni
yiṁduge śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
aṁdi nannu nelidivi appaḍim̐ dāvachchīni