వేఁడుకొనఁ గదవయ్య వేగమె నీవు
(॥పల్లవి॥)
వేఁడుకొనఁ గదవయ్య వేగమె నీవు
వాఁడి గోరితాకులకు వడిఁ దిట్టకుండునా
(॥వేఁడు॥)
ఆఁటది చిగురువంటి దంతగాసి కోపదు
గాఁటపు మాటాడితేనే కసుగందును
యేఁటికిఁ బిసికితివి యెగసక్కేనఁ జన్నులు
గూఁటఁ జిక్కి యిందుకాపె కోపగించకుండునా
(॥వేఁడు॥)
జవ్వని పూవువంటిది సడిఁబడ నోపదు
నవ్వితేనే వసివాడి నాము వేసును
రవ్వగా గిలిగింతురా రచ్చలోన మర్మములు
ఇవ్వల నిందుకునాపె యెగ్గువట్టకుండునా
(॥వేఁడు॥)
కన్నియ పూఁపవంటిది కాఁకలకు నోపదు
పన్నిచేతఁ బట్టితేనే పాలుదీసును
అన్నిటా శ్రీ వేంకటేశ అలయించితి కాఁగిట
సన్నల నిన్నిందుకాపె సాదించకుండునా
(||pallavi||)
vem̐ḍugŏnam̐ gadavayya vegamĕ nīvu
vām̐ḍi goridāgulagu vaḍim̐ diṭṭaguṁḍunā
(||vem̐ḍu||)
ām̐ṭadi siguruvaṁṭi daṁtagāsi kobadu
gām̐ṭabu māḍāḍidene kasugaṁdunu
yem̐ṭigim̐ bisigidivi yĕgasakkenam̐ jannulu
gūm̐ṭam̐ jikki yiṁdugābĕ kobagiṁchaguṁḍunā
(||vem̐ḍu||)
javvani pūvuvaṁṭidi saḍim̐baḍa nobadu
navvidene vasivāḍi nāmu vesunu
ravvagā giligiṁturā rachchalona marmamulu
ivvala niṁdugunābĕ yĕgguvaṭṭaguṁḍunā
(||vem̐ḍu||)
kanniya pūm̐pavaṁṭidi kām̐kalagu nobadu
pannisedam̐ baṭṭidene pāludīsunu
anniḍā śhrī veṁkaḍeśha alayiṁchidi kām̐giḍa
sannala ninniṁdugābĕ sādiṁchaguṁḍunā