Vemdugomgaam dana maada vina nanenaa

వేఁడుకోఁగాఁ దన మాట విన ననేనా
Language

(॥పల్లవి॥)
వేఁడుకోఁగాఁ దన మాట విన ననేనా
పోఁడిమితోఁ దన్ను నేను బుట్టెడిగేఁ గాకా

(॥॥)
బలిమిఁ జేసిన పొందు పస చాలదు
పిలువక వచ్చేరాక ప్రియము గాదు
చలాలకు నవ్వే నవ్వు చవి పుట్టదు
తెలిపి చెప్పరే యీ తెఱఁగు లాతనికి

(॥॥)
మనసు రాని మాట మఱువ రాదు
ననచని సరసము నాఁటుకొనదు
పని లేని వినయాలు పాదుకొనవు
వినిపించరే యీ విధము లాతనికి

(॥॥)
ఆసతోఁ జూడని చూపు అంటుకొనదు
వేసరిన రతులకు వేడుక లేదు
సేసవెట్టి నన్నుఁదానే శ్రీ వేంకటేశుఁడు గూడే
లాసి తలఁపించరే యీ లాగు లాతనికి

(||pallavi||)
vem̐ḍugom̐gām̐ dana māḍa vina nanenā
pom̐ḍimidom̐ dannu nenu buṭṭĕḍigem̐ gāgā

(||||)
balimim̐ jesina pŏṁdu pasa sāladu
piluvaga vachcherāga priyamu gādu
salālagu navve navvu savi puṭṭadu
tĕlibi sĕppare yī tĕṟam̐gu lādanigi

(||||)
manasu rāni māḍa maṟuva rādu
nanasani sarasamu nām̐ṭugŏnadu
pani leni vinayālu pādugŏnavu
vinibiṁchare yī vidhamu lādanigi

(||||)
āsadom̐ jūḍani sūbu aṁṭugŏnadu
vesarina radulagu veḍuga ledu
sesavĕṭṭi nannum̐dāne śhrī veṁkaḍeśhum̐ḍu gūḍe
lāsi talam̐piṁchare yī lāgu lādanigi