వేమారు నెంతలేదు వెలుమజోలి
(॥పల్లవి॥)
వేమారు నెంతలేదు వెలుమజోలి
నేము నీవలెనే కూర్మి నెరపేము గాక
(॥వేమా॥)
నీకు నాతనిమాఁటలు నీలోనె తెలుసునే
మాకేమి చెప్పేవు మాపుదాఁకాను
దాకొని మీవద్ద నేము తగవులు దిద్దేమా
జోకల మీవోపికలు చూచే మింతేకాక
(॥వేమా॥)
మీ యిద్దరిచేఁతలు మీకుమీకే అందాలే
చాయలేల అడిగేరే సారె మమ్మును
యేమనేము నేము మిమ్ము నెటువలె నడచినా
బూమిలో మీనేరుపులే పొగడేముగాక
(॥వేమా॥)
మచ్చికలమీనవ్వులు మాకెల్లాఁ దెలుసునా
చెచ్చెర మీకే ఇవి సెలవుగాక
యిచ్చకమై శ్రీవేంకటేశుఁ డేలె నన్ను; నీవు
ముచ్చటలాడితే మీకు మొక్కేముగాక
(||pallavi||)
vemāru nĕṁtaledu vĕlumajoli
nemu nīvalĕne kūrmi nĕrabemu gāga
(||vemā||)
nīgu nādanimām̐ṭalu nīlonĕ tĕlusune
māgemi sĕppevu mābudām̐kānu
dāgŏni mīvadda nemu tagavulu diddemā
jogala mīvobigalu sūse miṁtegāga
(||vemā||)
mī yiddarisem̐talu mīgumīge aṁdāle
sāyalela aḍigere sārĕ mammunu
yemanemu nemu mimmu nĕḍuvalĕ naḍasinā
būmilo mīnerubule pŏgaḍemugāga
(||vemā||)
machchigalamīnavvulu māgĕllām̐ dĕlusunā
sĕchchĕra mīge ivi sĕlavugāga
yichchagamai śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu; nīvu
muchchaḍalāḍide mīgu mŏkkemugāga