Velubalam betti maado vesaalela sesevu

వెలుపలఁ బెట్టి మాతో వేసాలేల సేసేవు
Language

(॥పల్లవి॥)
వెలుపలఁ బెట్టి మాతో వేసాలేల సేసేవు
కలపితే కదుపునఁ గలసి యిట్టుండుఁగా

(॥వెలు॥)
యింతలో నీవాపెను యింటికి తెచ్చుకొంటేను
వంతులకు వాసులకు వచ్చుఁగా మాతో
చింతదీర నొక్కఁ టే సేసవెట్టి పెండ్లాడితే
పంతములుమీరక మాపనులకు వచ్చుఁగా

(॥వెలు॥)
చలివాపి ఆపెను మాసవతిఁగా జేసితేను
నిలువుఁ గొలువులను నిలుచుండుఁగా
కొలము తెలిపి మాతో కూటికి లోనుచేసితే
నెలకొని మావలె నిన్ను సంతోసించుఁగా

(॥వెలు॥)
గద్దెపీఁటమీఁద నాపెఁ గడఁ గూచుండఁబెట్టితే
సుద్దులెల్లఁ జెప్పుతాను సుకియించుఁగా
వొద్దిక నాపెను మమ్ము నొక్కటిగాఁ గూడితివి
వద్దనే శ్రీవేంకటేశా వాదులెల్లాఁ దీర్చుఁగా

(||pallavi||)
vĕlubalam̐ bĕṭṭi mādo vesālela sesevu
kalabide kadubunam̐ galasi yiṭṭuṁḍum̐gā

(||vĕlu||)
yiṁtalo nīvābĕnu yiṁṭigi tĕchchugŏṁṭenu
vaṁtulagu vāsulagu vachchum̐gā mādo
siṁtadīra nŏkkam̐ ṭe sesavĕṭṭi pĕṁḍlāḍide
paṁtamulumīraga mābanulagu vachchum̐gā

(||vĕlu||)
salivābi ābĕnu māsavadim̐gā jesidenu
niluvum̐ gŏluvulanu nilusuṁḍum̐gā
kŏlamu tĕlibi mādo kūḍigi lonuseside
nĕlagŏni māvalĕ ninnu saṁtosiṁchum̐gā

(||vĕlu||)
gaddĕbīm̐ṭamīm̐da nābĕm̐ gaḍam̐ gūsuṁḍam̐bĕṭṭide
suddulĕllam̐ jĕppudānu sugiyiṁchum̐gā
vŏddiga nābĕnu mammu nŏkkaḍigām̐ gūḍidivi
vaddane śhrīveṁkaḍeśhā vādulĕllām̐ dīrsum̐gā