Velubala vedagide vesa naatmam ganunaa

వెలుపల వెదకితే వెస నాత్మఁ గనునా
Language

(॥పల్లవి॥)
వెలుపల వెదకితే వెస నాత్మఁ గనునా
పలుమారు నిదే యభ్యాసము గావలెను

(॥వెలు॥)
యిన్ని చింతలు మఱచి యింద్రియాలఁ గుదియించి
పన్నివుండిన హృదయపద్మమందును
యెన్న నంగుష్ఠమాత్రపు టీశ్వరుపాదాల క్రింద
తన్ను నణుమాత్రముగఁ దలఁచఁగవలెను

(॥వెలు॥)
పలుదేహపుఁ గాళ్లఁ బరువులు వారక
బలుదేహపు టింటిలోపల చొచ్చి
చలివేఁడిఁ బొరలక సర్వేశుపాదాల క్రింద
తలకొన్న తన్నుఁ దానె తలఁచఁగవలెను

(॥వెలు॥)
కైకొన్న భక్తితో నిక్కపు శరణాగతితో
చేకొని విన్నపములు చేసుకొంటాను
యేకాంతాన శ్రీవేంకటేశ్వరు పాదాల క్రింద
దాకొని తన్నుఁ దానే తలఁచఁగవలెను

(||pallavi||)
vĕlubala vĕdagide vĕsa nātmam̐ ganunā
palumāru nide yabhyāsamu gāvalĕnu

(||vĕlu||)
yinni siṁtalu maṟasi yiṁdriyālam̐ gudiyiṁchi
pannivuṁḍina hṛdayabadmamaṁdunu
yĕnna naṁguṣhṭhamātrabu ṭīśhvarubādāla kriṁda
tannu naṇumātramugam̐ dalam̐sam̐gavalĕnu

(||vĕlu||)
paludehabum̐ gāḽlam̐ baruvulu vāraga
baludehabu ṭiṁṭilobala sŏchchi
salivem̐ḍim̐ bŏralaga sarveśhubādāla kriṁda
talagŏnna tannum̐ dānĕ talam̐sam̐gavalĕnu

(||vĕlu||)
kaigŏnna bhaktido nikkabu śharaṇāgadido
segŏni vinnabamulu sesugŏṁṭānu
yegāṁtāna śhrīveṁkaḍeśhvaru pādāla kriṁda
dāgŏni tannum̐ dāne talam̐sam̐gavalĕnu