వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు
(॥పల్లవి॥)
వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు
చలమున నిదియే ఘడియ ఘడియకును సాధించిన సుఖమటు దోఁచు
(॥వెలు॥)
వెలుపలి వెలుఁగే చూడఁగ లోపలి వెడ చీఁకటి గాననియట్లు
అలరి ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదు
పలుమరు చీఁకటి చూడఁగఁ జూడఁగ బయలే వెలుఁగై తోఁచినయట్లు
అలయక తనలోచూపు చూచినను అంతరంగమున హరిఁ గనును
(॥వెలు॥)
జాగరమే కడుఁ జేయఁగఁ జేయఁగ సతతము నిద్దుర రానట్లు
చేగల నింద్రియములలోఁ దిరిగిన చిత్తవికారము లయపడదు
యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు
యోగపు టేకాంతంబును దన మనసొగి మరవఁగ మరవఁగ హరిఁ గనును
(॥వెలు॥)
దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు
ఆహ జీవుని జననమరణములు అందే పొడముచు నందడఁగు
వూహల శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము
ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుట
(||pallavi||)
vĕlubala maṟavaga lobala ledu vĕlubalam̐ galigina lobala maṟasu
salamuna nidiye ghaḍiya ghaḍiyagunu sādhiṁchina sukhamaḍu dom̐su
(||vĕlu||)
vĕlubali vĕlum̐ge sūḍam̐ga lobali vĕḍa sīm̐kaḍi gānaniyaṭlu
alari prabaṁchajñānigim̐danalo nātmajñānamu ganarādu
palumaru sīm̐kaḍi sūḍam̐gam̐ jūḍam̐ga bayale vĕlum̐gai tom̐sinayaṭlu
alayaga tanalosūbu sūsinanu aṁtaraṁgamuna harim̐ ganunu
(||vĕlu||)
jāgarame kaḍum̐ jeyam̐gam̐ jeyam̐ga sadatamu niddura rānaṭlu
segala niṁdriyamulalom̐ dirigina sittavigāramu layabaḍadu
yīgadi nidduravom̐gām̐ bom̐gā nilalo suddulu yĕṟam̐ganiyaṭṭu
yogabu ṭegāṁtaṁbunu dana manasŏgi maravam̐ga maravam̐ga harim̐ ganunu
(||vĕlu||)
dehabu ṭāgāśhabu niṭṭūrbulu bāhirabu bayaḍa naḍaginayaṭlu
āha jīvuni jananamaraṇamulu aṁde pŏḍamusu naṁdaḍam̐gu
vūhala śhrīveṁkaḍabadi vāyuvu kŏgi nāgāśhamu vŏkka sūtramu
āhā prāṇābānavāyuvulu āduma nilubuḍe harim̐ ganuḍa