వెల్లివిరులాయనోయి వేడుకలు నీకు నేఁడు
(॥పల్లవి॥)
వెల్లివిరులాయనోయి వేడుకలు నీకు నేఁడు
గొల్ల దోమటి సేసిరి గొల్లెత లిందరను
(॥మోల్లి॥)
కలికి యొక్కతె నిన్నుఁ గైకొని పెండ్లి యాడఁగా
తలఁబాలు తోడువోసీ తాను నొకతె
యెలమిఁ బెండ్లిపీఁటపై నిద్దరు గూచుండఁగాను
చలపట్టి పొరుగాలు సంగడిఁ గూచుండీని
(॥మోల్లి॥)
హత్తి నీబువ్వాన నోక్క యంగన గాచుకుండఁగా
పొత్తులకు వేరొక్క పొలఁతి వచ్చె
బత్తితోడ మరొకతె బాగాలు చేతి కియ్యఁగా
మత్తిలి యంతలో నాకు మడిచి యిచ్చిని
(॥మోల్లి॥)
కొసరి యొక్కతె నిన్ను గోరి తెర వేసితేను
యెసగఁ బాన్పు వరచె నింతి యొకతె
పసగా శ్రీవేంకటేశ పాదా లొకతె వొత్తఁగ
యెసగి యలమేల్మంగ యిటు నిన్నుఁ గూడెను
(||pallavi||)
vĕllivirulāyanoyi veḍugalu nīgu nem̐ḍu
gŏlla domaḍi sesiri gŏllĕda liṁdaranu
(||molli||)
kaligi yŏkkadĕ ninnum̐ gaigŏni pĕṁḍli yāḍam̐gā
talam̐bālu toḍuvosī tānu nŏgadĕ
yĕlamim̐ bĕṁḍlibīm̐ṭabai niddaru gūsuṁḍam̐gānu
salabaṭṭi pŏrugālu saṁgaḍim̐ gūsuṁḍīni
(||molli||)
hatti nībuvvāna nokka yaṁgana gāsuguṁḍam̐gā
pŏttulagu verŏkka pŏlam̐ti vachchĕ
battidoḍa marŏgadĕ bāgālu sedi kiyyam̐gā
mattili yaṁtalo nāgu maḍisi yichchini
(||molli||)
kŏsari yŏkkadĕ ninnu gori tĕra vesidenu
yĕsagam̐ bānpu varasĕ niṁti yŏgadĕ
pasagā śhrīveṁkaḍeśha pādā lŏgadĕ vŏttam̐ga
yĕsagi yalamelmaṁga yiḍu ninnum̐ gūḍĕnu