వెల్లవిరులై యిఁక వెలసివుందువుగాక
(॥పల్లవి॥)
వెల్లవిరులై యిఁక వెలసివుందువుగాక
చెల్లఁ బో యింకానేలే చిడుముడి సిగ్గులు
(॥వెల్ల॥)
చన్నులపై నిండినవి చందమామ పిల్లలు
పన్నీటి కాలువలు పారీఁ జెక్కులు
వున్నతి పెండ్లివిడే లొద్దికఁ బుక్కిట నిండా
వన్నెలాఁడి ఇఁకనేలే వలవనిసిగ్గులు
(॥వెల్ల॥)
యెదిరించి తోఁచె నదె యెరసంజ కన్నులను
చెదరీ సెలవులను చిరుముత్యాలు
గుదిగొని మేన నిండె గుంపులై జాజి ననలు
మదిరాక్షి యిఁక నేలే మాయదారి సిగ్గులు
(॥వెల్ల॥)
తతిఁ దురుముపై నవె తలఁబాల వజ్రాలు
కతమాయఁ దెమ్మెరలు సారెసారెకు
ఇతవై శ్రీవేంకటేశుఁ డీతఁ డిదె నన్నుఁ గూడె
కతకారి ఇఁక నేలే కాయకపు సిగ్గులు
(||pallavi||)
vĕllavirulai yim̐ka vĕlasivuṁduvugāga
sĕllam̐ bo yiṁkānele siḍumuḍi siggulu
(||vĕlla||)
sannulabai niṁḍinavi saṁdamāma pillalu
pannīḍi kāluvalu pārīm̐ jĕkkulu
vunnadi pĕṁḍliviḍe lŏddigam̐ bukkiḍa niṁḍā
vannĕlām̐ḍi im̐kanele valavanisiggulu
(||vĕlla||)
yĕdiriṁchi tom̐sĕ nadĕ yĕrasaṁja kannulanu
sĕdarī sĕlavulanu sirumutyālu
gudigŏni mena niṁḍĕ guṁpulai jāji nanalu
madirākṣhi yim̐ka nele māyadāri siggulu
(||vĕlla||)
tadim̐ durumubai navĕ talam̐bāla vajrālu
kadamāyam̐ dĕmmĕralu sārĕsārĕgu
idavai śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍidĕ nannum̐ gūḍĕ
kadagāri im̐ka nele kāyagabu siggulu