వెల్లవిరి సేతురటే వెక్కసపు మగవాని
(॥పల్లవి॥)
వెల్లవిరి సేతురటే వెక్కసపు మగవాని
తెల్లమిగాఁ గోపించితే తెగువలు మీరవా
(॥వెల్ల॥)
మదనాతురుఁ డొకరిమాటలు వినేనా
పొదలి చింతలనే పొరలుఁగాక
పదరి ననుబోంట్లు బలిమి సేసి పట్టితే
విదిలించి సిగ్గులెల్లా విడువక మానునా
(॥వెల్ల॥)
ననుపువేడుకకాఁడు నవ్వేవారి నెరుఁగునా
మునుకొన్నవలపుల మునుగుఁగాక
కొనఁ బెట్టి మన మెంతకద్ది నిలుపఁ బోయినా
తను యించుకంత మొకదాకిరియు మానఁడా
(॥వెల్ల॥)
ఆసలఁ జిక్కినవాఁడు అవుఁగాము లెరుఁగు
వేసరక అదేపనై వెదకుఁ గాక
వేసాల శ్రీవేంకటేశు వెలయ నేఁ గూడితి
యీసు దీరె నన్నే కాక యితరులఁ బొందునా
(||pallavi||)
vĕllaviri seduraḍe vĕkkasabu magavāni
tĕllamigām̐ gobiṁchide tĕguvalu mīravā
(||vĕlla||)
madanādurum̐ ḍŏgarimāḍalu vinenā
pŏdali siṁtalane pŏralum̐gāga
padari nanuboṁṭlu balimi sesi paṭṭide
vidiliṁchi siggulĕllā viḍuvaga mānunā
(||vĕlla||)
nanubuveḍugagām̐ḍu navvevāri nĕrum̐gunā
munugŏnnavalabula munugum̐gāga
kŏnam̐ bĕṭṭi mana mĕṁtagaddi nilubam̐ boyinā
tanu yiṁchugaṁta mŏgadāgiriyu mānam̐ḍā
(||vĕlla||)
āsalam̐ jikkinavām̐ḍu avum̐gāmu lĕrum̐gu
vesaraga adebanai vĕdagum̐ gāga
vesāla śhrīveṁkaḍeśhu vĕlaya nem̐ gūḍidi
yīsu dīrĕ nanne kāga yidarulam̐ bŏṁdunā