వెల్లవిరాయఁ బనులు విట్ఠలేశ్వరా
(॥పల్లవి॥)
వెల్లవిరాయఁ బనులు విట్ఠలేశ్వరా
చల్లజంపు సేఁతల సటకారివాఁడవు
(॥॥)
ననుఁజూచి కొలువులో నవ్వినదే చాలదా
వనితల యెడల గర్వపు వాఁడవు
చెనకి యప్పటి నన్నుఁ జేఁత నంటవలెనా
పొనుగనివలపులపొత్తులవాఁడవు
(॥॥)
మచ్చికల నాతోడ మాటాడుచే చాలదా
కుచ్చితపు బహు పరాకులవాఁడవు
విచ్చనవిడి నిప్పుడే విడెమియ్యవలెనా
మచ్చు వేసితీ సేవెడమాయదారివాఁడవు
(॥॥)
సంగడి నాపై సేస చల్లుటే చాలదా
సంగ తెరిఁగి నెన రజాణకాఁడవు
చెంగట నన్నేలితివి శ్రీనేంకటేశుఁడవై
యెంగిలి సేయవలెనా యిచ్చకపువాఁడవు
(||pallavi||)
vĕllavirāyam̐ banulu viṭṭhaleśhvarā
sallajaṁpu sem̐tala saḍagārivām̐ḍavu
(||||)
nanum̐jūsi kŏluvulo navvinade sāladā
vanidala yĕḍala garvabu vām̐ḍavu
sĕnagi yappaḍi nannum̐ jem̐ta naṁṭavalĕnā
pŏnuganivalabulabŏttulavām̐ḍavu
(||||)
machchigala nādoḍa māḍāḍuse sāladā
kuchchidabu bahu parāgulavām̐ḍavu
vichchanaviḍi nippuḍe viḍĕmiyyavalĕnā
machchu vesidī sevĕḍamāyadārivām̐ḍavu
(||||)
saṁgaḍi nābai sesa salluḍe sāladā
saṁga tĕrim̐gi nĕna rajāṇagām̐ḍavu
sĕṁgaḍa nannelidivi śhrīneṁkaḍeśhum̐ḍavai
yĕṁgili seyavalĕnā yichchagabuvām̐ḍavu