(॥పల్లవి॥)
వెల్లవిరాయ వలపు వేసాలేలే
చల్లగా నతఁడు నిన్ను సమ్మతించఁజేసెను
(॥వెల్ల॥)
సెలవిఁబారేటినవ్వు చేతనేల మూసేవే
అలుక దేరిచె విభుఁడపుడే నిన్ను
బలువైన పులకలు పయ్యదనేల తడిచేవే
సొలసి మర్మ మతఁడు సోఁకించె నిన్నును
(॥వెల్ల॥)
అంగపుఁ జెమటలు పయ్యదనేల తుడిచేవే
వెంగలి నీసిగ్గతఁడు విడిపించెను
ముంగిటినీనిట్టూర్పులు మొరఁగి యేలణఁచేవే
చెంగలించ జేసి నీలో చింతవాపె నతఁడు
(॥వెల్ల॥)
వేడుక మోవికెంపులు విడేననేల కుప్పేవే
కూడి యీతఁడే నీ కొంకు దేర్చెను
యీడనె శ్రీ వేంకటేశ నింతలోనేల మెచ్చేవే
జాడతోఁ గలకాలము సతమాయ నీకును
(||pallavi||)
vĕllavirāya valabu vesālele
sallagā nadam̐ḍu ninnu sammadiṁcham̐jesĕnu
(||vĕlla||)
sĕlavim̐bāreḍinavvu sedanela mūseve
aluga derisĕ vibhum̐ḍabuḍe ninnu
baluvaina pulagalu payyadanela taḍiseve
sŏlasi marma madam̐ḍu som̐kiṁchĕ ninnunu
(||vĕlla||)
aṁgabum̐ jĕmaḍalu payyadanela tuḍiseve
vĕṁgali nīsiggadam̐ḍu viḍibiṁchĕnu
muṁgiḍinīniṭṭūrbulu mŏram̐gi yelaṇam̐seve
sĕṁgaliṁcha jesi nīlo siṁtavābĕ nadam̐ḍu
(||vĕlla||)
veḍuga movigĕṁpulu viḍenanela kuppeve
kūḍi yīdam̐ḍe nī kŏṁku dersĕnu
yīḍanĕ śhrī veṁkaḍeśha niṁtalonela mĕchcheve
jāḍadom̐ galagālamu sadamāya nīgunu