Velimdomse dogadi vesamu neelo nogadi

వెలిఁదోఁచే దొకటి వేసము నీలో నొకటి
Language

(॥పల్లవి॥)
వెలిఁదోఁచే దొకటి వేసము నీలో నొకటి
చలివాయ రమణుని చనవు చేకొనవే

(॥వెలి॥)
గక్కన నవ్వేవుగాని కన్నుల కెంపులు వొవు
ఇక్కడ నలుక దీరు టెట్టు నమ్మేది
నిక్కముమాటలాడేవు నిట్టూర్పు లణఁగవు
చక్కనిపతికి నీకు సంతస మెట్లాయనే

(॥వెలి॥)
పొంచి వీడెమిచ్చేవు బోమ్మముళ్లు నున్న వవె
యెంచఁగ మీమచ్చరము లెట్టు దీరెనే
మంచమెక్కి వుందానవు మానవు నివ్వెరగులు
వంచించ కిద్దరిలోన వాదు లెట్టు దీరెనే

(॥వెలి॥)
కాఁగిట నించే వతనిఁ గాఁకలు మేన నున్నవి
ఆఁగినచేఁత లింకా నవి యేఁటివే
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశునిట్టె
నాఁగు వారె మీగుణాలు నమ్మనెట్టువచ్చునే

(||pallavi||)
vĕlim̐dom̐se dŏgaḍi vesamu nīlo nŏgaḍi
salivāya ramaṇuni sanavu segŏnave

(||vĕli||)
gakkana navvevugāni kannula kĕṁpulu vŏvu
ikkaḍa naluga dīru ṭĕṭṭu nammedi
nikkamumāḍalāḍevu niṭṭūrbu laṇam̐gavu
sakkanibadigi nīgu saṁtasa mĕṭlāyane

(||vĕli||)
pŏṁchi vīḍĕmichchevu bommamuḽlu nunna vavĕ
yĕṁcham̐ga mīmachcharamu lĕṭṭu dīrĕne
maṁchamĕkki vuṁdānavu mānavu nivvĕragulu
vaṁchiṁcha kiddarilona vādu lĕṭṭu dīrĕne

(||vĕli||)
kām̐giḍa niṁche vadanim̐ gām̐kalu mena nunnavi
ām̐ginasem̐ta liṁkā navi yem̐ṭive
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśhuniṭṭĕ
nām̐gu vārĕ mīguṇālu nammanĕṭṭuvachchune