(॥పల్లవి॥)
వెలయఁగఁ దెర యిఁక వేయఁగదే
నిలువునఁ బులకలు నిండఁగఁ దొడఁగె
(॥వెల॥)
విరులఁగొని పతిని వేయఁగ వేయఁగ
మరుని శరములై మైకొనెను
సురతవు నటనలు చూపఁగఁ జూపఁగ
పెరరేఁపులు మదిఁ బెనగొనఁ దొడఁగె
(॥వెల॥)
చక్కగఁ గప్రము చల్లఁగఁ జల్లఁగ
చొక్కుమందులై సుడిగొనెను
అక్కర మాటలు ఆడఁగ నాడఁగ
మక్కువవలపులు మలయఁగఁ దొడఁగె
(॥వెల॥)
యింపుల విడియము లియ్యఁగ నియ్యఁగ
ముంపులమదములు మునుకొనెను
అంపక శ్రీవేంకటాధిపు సెనయఁగ
సంపదతమకము జడిఁగొనఁ దొడఁగె
(||pallavi||)
vĕlayam̐gam̐ dĕra yim̐ka veyam̐gade
niluvunam̐ bulagalu niṁḍam̐gam̐ dŏḍam̐gĕ
(||vĕla||)
virulam̐gŏni padini veyam̐ga veyam̐ga
maruni śharamulai maigŏnĕnu
suradavu naḍanalu sūbam̐gam̐ jūbam̐ga
pĕrarem̐pulu madim̐ bĕnagŏnam̐ dŏḍam̐gĕ
(||vĕla||)
sakkagam̐ gapramu sallam̐gam̐ jallam̐ga
sŏkkumaṁdulai suḍigŏnĕnu
akkara māḍalu āḍam̐ga nāḍam̐ga
makkuvavalabulu malayam̐gam̐ dŏḍam̐gĕ
(||vĕla||)
yiṁpula viḍiyamu liyyam̐ga niyyam̐ga
muṁpulamadamulu munugŏnĕnu
aṁpaga śhrīveṁkaḍādhibu sĕnayam̐ga
saṁpadadamagamu jaḍim̐gŏnam̐ dŏḍam̐gĕ