వెలయఁ బెండ్లాడితివి వెఱపేఁటికి
(॥పల్లవి॥)
వెలయఁ బెండ్లాడితివి వెఱపేఁటికి
వెలకా వేగు నుండఁగా వెఱపేఁటికి
(॥వెల॥)
పాడిపంతము లెరిఁగి బ్రదికించేమొగఁడవు
వేడుక నీవు సేయఁగ వెఱపేఁటికి
వాడికసతులలోన వలసినయట్టు మన్నించి
వీడెము నియ్యఁగాను వెఱపేఁటికి
(॥వెల॥)
ఆస యిచ్చినవాఁడవు ఆదరించిననామీఁద
వేసితివి నీచేయి వెఱపేఁటికి
యీసుద్దులెల్లా విని యెదుటనే నీవుండి
వేసారక బాసియ్యఁగ వెఱపేఁటికి
(॥వెల॥)
ఘనుఁడ శ్రీ వేంకటేశ కాఁగిలించి నన్ను నేలి
వెనుబలమై యుండఁగా వెఱపేఁటికి
పనితోడ రతులను పంతమిచ్చి సారెసారె
వినయాలు సేయఁగాను వెఱపేఁటికి
(||pallavi||)
vĕlayam̐ bĕṁḍlāḍidivi vĕṟabem̐ṭigi
vĕlagā vegu nuṁḍam̐gā vĕṟabem̐ṭigi
(||vĕla||)
pāḍibaṁtamu lĕrim̐gi bradigiṁchemŏgam̐ḍavu
veḍuga nīvu seyam̐ga vĕṟabem̐ṭigi
vāḍigasadulalona valasinayaṭṭu manniṁchi
vīḍĕmu niyyam̐gānu vĕṟabem̐ṭigi
(||vĕla||)
āsa yichchinavām̐ḍavu ādariṁchinanāmīm̐da
vesidivi nīseyi vĕṟabem̐ṭigi
yīsuddulĕllā vini yĕduḍane nīvuṁḍi
vesāraga bāsiyyam̐ga vĕṟabem̐ṭigi
(||vĕla||)
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kām̐giliṁchi nannu neli
vĕnubalamai yuṁḍam̐gā vĕṟabem̐ṭigi
panidoḍa radulanu paṁtamichchi sārĕsārĕ
vinayālu seyam̐gānu vĕṟabem̐ṭigi