వెలయ నానతీవయ్యా వినే నేను
(॥పల్లవి॥)
వెలయ నానతీవయ్యా వినే నేను
తలపోఁతలో నీకుఁ దమకము గలదో
(॥వెల॥)
పంచనున్న నీ సతితో పంతాలు నే నాడఁగాను
మంచి మాటలెల్లా నీవు మాతో నాడేవు
పొంచి ఎవ్వరైనా నిన్నుఁ బొగడఁగవలశో
నించి నీదయ నాపై నిజాలకుఁ గలదో
(॥వెల॥)
చాయలకు నీ ఇంతితో చలము సాదించఁగాను
సేయరాని వినయాలు సేసేవు నీవు
నాయగాఁడవు గనక నమ్మించవలయశో
యీయెడ నిట్టె నీవే నన్నేలుకొనేవిధమో
(॥వెల॥)
అలమేల్మంగ నీచెలి ఆపెకు నే మొక్కఁగాను
సులభుఁడవై నాకు సొమ్ములిచ్చేవు
యెలమి శ్రీవేంకటేశ యెవ్వరైనాఁ జెప్పిరో
వలెనని నీవు నాకు వలచిన తెరఁగో
(||pallavi||)
vĕlaya nānadīvayyā vine nenu
talabom̐talo nīgum̐ damagamu galado
(||vĕla||)
paṁchanunna nī sadido paṁtālu ne nāḍam̐gānu
maṁchi māḍalĕllā nīvu mādo nāḍevu
pŏṁchi ĕvvarainā ninnum̐ bŏgaḍam̐gavalaśho
niṁchi nīdaya nābai nijālagum̐ galado
(||vĕla||)
sāyalagu nī iṁtido salamu sādiṁcham̐gānu
seyarāni vinayālu sesevu nīvu
nāyagām̐ḍavu ganaga nammiṁchavalayaśho
yīyĕḍa niṭṭĕ nīve nannelugŏnevidhamo
(||vĕla||)
alamelmaṁga nīsĕli ābĕgu ne mŏkkam̐gānu
sulabhum̐ḍavai nāgu sŏmmulichchevu
yĕlami śhrīveṁkaḍeśha yĕvvarainām̐ jĕppiro
valĕnani nīvu nāgu valasina tĕram̐go