వెలయ ముందటెత్తు విచారించుకొనవయ్య
(॥పల్లవి॥)
వెలయ ముందటెత్తు విచారించుకొనవయ్య
కలసేవు నా కాఁగిటఁ గాదనేనా నేను
(॥॥)
బచ్చెనమాట లాడి భామ నిన్ను వలపించె
యిచ్చకములే సేసి యిల్లుమరిపె
లచ్చనగా మోవిమీఁద లకముద్రలునుఁ బెట్టె
యిచ్చటికి విచ్చేసితి వేమనునో ఆపె
(॥॥)
గక్కన తనసొమ్మని కంకణము చేతఁ గట్టె
తక్కన సేవలుసేసి తమిరేఁచెను
పక్కనఁ బూవులదండ పై వేసె గురుతుగా
ఇక్కడ నన్నుఁ జెనకే వేమనునో ఆపె
(॥॥)
నెలకొని పొదాలొత్తి నిన్ను నిట్టె పెండ్లాడె
లలి గంటలనూలు నీమొలఁ గట్టెను
చెలఁగి నాకు వలచి శ్రీ వేంకటేశకూడితి....
వెలమి నిట్టె విని యేమనునో ఆపె
(||pallavi||)
vĕlaya muṁdaḍĕttu visāriṁchugŏnavayya
kalasevu nā kām̐giḍam̐ gādanenā nenu
(||||)
bachchĕnamāḍa lāḍi bhāma ninnu valabiṁchĕ
yichchagamule sesi yillumaribĕ
lachchanagā movimīm̐da lagamudralunum̐ bĕṭṭĕ
yichchaḍigi vichchesidi vemanuno ābĕ
(||||)
gakkana tanasŏmmani kaṁkaṇamu sedam̐ gaṭṭĕ
takkana sevalusesi tamirem̐sĕnu
pakkanam̐ būvuladaṁḍa pai vesĕ gurudugā
ikkaḍa nannum̐ jĕnage vemanuno ābĕ
(||||)
nĕlagŏni pŏdālŏtti ninnu niṭṭĕ pĕṁḍlāḍĕ
lali gaṁṭalanūlu nīmŏlam̐ gaṭṭĕnu
sĕlam̐gi nāgu valasi śhrī veṁkaḍeśhagūḍidi....
vĕlami niṭṭĕ vini yemanuno ābĕ