వెల(ర?)సె నహోబలాన విదారణసింహము
(॥పల్లవి॥)
వెల(ర?)సె నహోబలాన విదారణసింహము
సురల నరుల దయఁ జూచీని వీఁడివో
(॥వెలసె॥)
సరి వలకేలను చక్రము పీటఁగాఁ బెట్టీ
గరిమ నొకచేత శంఖము వట్టి
హిరణ్యకలిపుని నిరుచాతులాఁ జించి
అరిదిఁ బేగులు జందేలవే వేసుకొనెను
(॥వెలసె॥)
ఘనమైన కోరలతో కహకహ నవ్వుకొంటా
దనుజు ముంద రొకచేతనుఁ బట్టి
పెనఁగకుండా రొమ్ము పెడచేతుల నడిచి
నినువు వంకరగోళ్ళ నెత్తురు చిమ్వీని
(॥వెలసె॥)
అంతటఁ బ్రహ్లదుని నటు దయఁజూచి లక్ష్మీ
కాంతఁ దొడపై నిడుక కడు శాంతుఁడై
చింత దీర గరుడాద్రి శ్రీవేంకటాద్రిని
పంతము మెరసి నిల్చి ప్రతాపించీనీ
(||pallavi||)
vĕla(ra?)sĕ nahobalāna vidāraṇasiṁhamu
surala narula dayam̐ jūsīni vīm̐ḍivo
(||vĕlasĕ||)
sari valagelanu sakramu pīḍam̐gām̐ bĕṭṭī
garima nŏgaseda śhaṁkhamu vaṭṭi
hiraṇyagalibuni nirusādulām̐ jiṁchi
aridim̐ begulu jaṁdelave vesugŏnĕnu
(||vĕlasĕ||)
ghanamaina koralado kahagaha navvugŏṁṭā
danuju muṁda rŏgasedanum̐ baṭṭi
pĕnam̐gaguṁḍā rŏmmu pĕḍasedula naḍisi
ninuvu vaṁkaragoḽḽa nĕtturu simvīni
(||vĕlasĕ||)
aṁtaḍam̐ brahladuni naḍu dayam̐jūsi lakṣhmī
kāṁtam̐ dŏḍabai niḍuga kaḍu śhāṁtum̐ḍai
siṁta dīra garuḍādri śhrīveṁkaḍādrini
paṁtamu mĕrasi nilsi pradābiṁchīnī