వెలఁదివిరహ మెంతో విన్నవించితిమి నీకు
(॥పల్లవి॥)
వెలఁదివిరహ మెంతో విన్నవించితిమి నీకు
తలఁపు దలఁపు మీకే తారుకాణలైనవి
(॥వెల॥)
మాట లెందున్నవోకాని మగువకోర్కులు నీ -
తేటలమోవియందే తిరమైనవి
నీటుఁజూపు లెందున్నవో నివ్వెరగై వూర్పులెల్లా
కూటున నీముద్రలపైఁ గుమ్మరించినవి
(॥వెల॥)
వివర మెందున్నదో వెలఁదికి వీను లివె
తవిలి నీసుద్దులందే తావైనవి
వువిదకు గమన మెందున్నదో పాదములు
యివల నీవున్నవీది కిటు మొకమైనవి
(॥వెల॥)
పంత మెందున్నదోకాని పడఁతికి వినయాలు
చెంతల నీదూతికకే సెలవైనవి
యింతలో శ్రీవేంకటేశ యిట్టే విచ్చేసి చెలని
సంతసానఁ గూడఁగాను జయము చేకొన్నది
(||pallavi||)
vĕlam̐diviraha mĕṁto vinnaviṁchidimi nīgu
talam̐pu dalam̐pu mīge tārugāṇalainavi
(||vĕla||)
māḍa lĕṁdunnavogāni maguvagorgulu nī -
teḍalamoviyaṁde tiramainavi
nīḍum̐jūbu lĕṁdunnavo nivvĕragai vūrbulĕllā
kūḍuna nīmudralabaim̐ gummariṁchinavi
(||vĕla||)
vivara mĕṁdunnado vĕlam̐digi vīnu livĕ
tavili nīsuddulaṁde tāvainavi
vuvidagu gamana mĕṁdunnado pādamulu
yivala nīvunnavīdi kiḍu mŏgamainavi
(||vĕla||)
paṁta mĕṁdunnadogāni paḍam̐tigi vinayālu
sĕṁtala nīdūdigage sĕlavainavi
yiṁtalo śhrīveṁkaḍeśha yiṭṭe vichchesi sĕlani
saṁtasānam̐ gūḍam̐gānu jayamu segŏnnadi