వెలఁదిఁ జూతువు గాని విచ్చేయవయ్యా
(॥పల్లవి॥)
వెలఁదిఁ జూతువు గాని విచ్చేయవయ్యా
తలఁచినంతము నీకుఁ దలకూడె నేఁడు
(॥వెలఁ॥)
పట్టిన విరహమే పడఁతిమేనిమీఁద
ఇట్టునట్టు చందురుఁడే యెండ గాసెను
పుట్టుచు సాదు రేఁగితే పొలమేర నిలువఁడు
నెట్టిన ననేటిమాట నిజమాయ నేఁడు
(॥వెలఁ॥)
వొల్లనే నీతోనలిగివున్న వేళనే యీ-
పల్లదపురమణుఁడు బాదపెట్టెను
చల్లజంపు భువిలోన చాపకింది వెల్లువని
యెల్ల వారునాడేది యెన్నికకు వచ్చెను
(॥వెలఁ॥)
కూడిన కాఁగిటివేళ గుంపుగూడి కోవిలలు
పాడి పాడి యింతిరతి వచ్చిసేసెను
వాడిక శ్రీవేంకటేశ వనితఁ గూడితి విట్టె
చాడికాండ్ల బ్రతుకు సతములయ్యీనా
(||pallavi||)
vĕlam̐dim̐ jūduvu gāni vichcheyavayyā
talam̐sinaṁtamu nīgum̐ dalagūḍĕ nem̐ḍu
(||vĕlam̐||)
paṭṭina virahame paḍam̐timenimīm̐da
iṭṭunaṭṭu saṁdurum̐ḍe yĕṁḍa gāsĕnu
puṭṭusu sādu rem̐gide pŏlamera niluvam̐ḍu
nĕṭṭina naneḍimāḍa nijamāya nem̐ḍu
(||vĕlam̐||)
vŏllane nīdonaligivunna veḽane yī-
palladaburamaṇum̐ḍu bādabĕṭṭĕnu
sallajaṁpu bhuvilona sābagiṁdi vĕlluvani
yĕlla vārunāḍedi yĕnnigagu vachchĕnu
(||vĕlam̐||)
kūḍina kām̐giḍiveḽa guṁpugūḍi kovilalu
pāḍi pāḍi yiṁtiradi vachchisesĕnu
vāḍiga śhrīveṁkaḍeśha vanidam̐ gūḍidi viṭṭĕ
sāḍigāṁḍla bradugu sadamulayyīnā