Velamdi yittumdidenu vibhuni sittamu vachchu

వెలఁది యిట్టుండితేను విభుని చిత్తము వచ్చు
Language

(॥పల్లవి॥)
వెలఁది యిట్టుండితేను విభుని చిత్తము వచ్చు
బలవంతకోలైతే పలుక నేమున్నది

(॥వెల॥)
పతి పరాకైవుండితే పైపై నెచ్చరించవలె
మితితో సన్న యెఱిఁగి మెలఁగవలె
యితవైనమాటలాడి యింపుల మెప్పించవలె
తతితోఁ గొలువసేసి దండ నుండవలెను

(॥వెల॥)
మొగమెత్తి చూచితే మోహము చల్లఁగవలె
నగితేఁ గమ్మటీ మారు నగవలె
బిగువుఁజన్ను లంటితేఁ బ్రియపడి వుండవలె
జిగిఁ జెనకితే గుట్టుచేసుకోవలెను

(॥వెల॥)
వేడుకతో మన్నించితే వినయము చూపవలె
జోడై యేకతాన రతిఁ జొక్కించవలె
యీడనె శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
కూడితి మిందరి కివే గుణాలు గావలెను

(||pallavi||)
vĕlam̐di yiṭṭuṁḍidenu vibhuni sittamu vachchu
balavaṁtagolaide paluga nemunnadi

(||vĕla||)
padi parāgaivuṁḍide paibai nĕchchariṁchavalĕ
midido sanna yĕṟim̐gi mĕlam̐gavalĕ
yidavainamāḍalāḍi yiṁpula mĕppiṁchavalĕ
tadidom̐ gŏluvasesi daṁḍa nuṁḍavalĕnu

(||vĕla||)
mŏgamĕtti sūside mohamu sallam̐gavalĕ
nagidem̐ gammaḍī māru nagavalĕ
biguvum̐jannu laṁṭidem̐ briyabaḍi vuṁḍavalĕ
jigim̐ jĕnagide guṭṭusesugovalĕnu

(||vĕla||)
veḍugado manniṁchide vinayamu sūbavalĕ
joḍai yegadāna radim̐ jŏkkiṁchavalĕ
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
kūḍidi miṁdari kive guṇālu gāvalĕnu