Velamdi yeemaamte vinnavimcha nampe

వెలఁది యీమాఁటె విన్నవించ నంపె
Language

(॥పల్లవి॥)
వెలఁది యీమాఁటె విన్నవించ నంపె
వలవని జోలి వద్దు సుమీ

(॥వెలది॥)
తరుణిచూపుల దట్టపు వెన్నెల
గరిమ నీపైఁ గాయఁగానె
విరహపుఁగాక వేసవి యెండలఁ
బోరలే వే మయ్య పొద్దు వోదా

(॥వెలది॥)
పేఁడుచు మాటలఁ బెరతేనె నీపైఁ
బోఁడి మాపె బూయఁగానె
వేఁడి నిట్టూర్పుల వెసఁ గారముల
మాఁడ నేల నీకు మంకు గద్దా

(॥వెలది॥)
కొమ్మ నిన్నంతలోఁ గూడి మోవులనె
చిమ్ముచు విందులు నేయఁగానె
యిమ్ముల శ్రీవెంకటేశ ర తెంకలి
కమ్మరఁ బెంచేవు కడ లేదా

(||pallavi||)
vĕlam̐di yīmām̐ṭĕ vinnaviṁcha naṁpĕ
valavani joli vaddu sumī

(||vĕladi||)
taruṇisūbula daṭṭabu vĕnnĕla
garima nībaim̐ gāyam̐gānĕ
virahabum̐gāga vesavi yĕṁḍalam̐
borale ve mayya pŏddu vodā

(||vĕladi||)
pem̐ḍusu māḍalam̐ bĕradenĕ nībaim̐
bom̐ḍi mābĕ būyam̐gānĕ
vem̐ḍi niṭṭūrbula vĕsam̐ gāramula
mām̐ḍa nela nīgu maṁku gaddā

(||vĕladi||)
kŏmma ninnaṁtalom̐ gūḍi movulanĕ
simmusu viṁdulu neyam̐gānĕ
yimmula śhrīvĕṁkaḍeśha ra tĕṁkali
kammaram̐ bĕṁchevu kaḍa ledā