Velamdi samdamulellaa vinnavimchidi midigo

వెలఁది చందములెల్లా విన్నవించితి మిదిగో
Language

(॥పల్లవి॥)
వెలఁది చందములెల్లా విన్నవించితి మిదిగో
తలఁపెరిఁగి మన్నించి దయఁజూడు మిఁకను

(॥వెలఁ॥)
చెలులతో నీ కతలు చెప్పి గొంత తనివొందు
తలపోఁతలనుఁ గొంత తమకమార్చు
కలలోన నీ రూప గని సంతసించుకొను
కలికిఁ గాఁగిట నెపుడు గలసేవోకాని

(॥వెలఁ॥)
పొదలి నీ కెదురు చూపులఁ గొంత చెలరేఁగు
కదియు రతి వేడుకలఁ గాఁకలార్చు
ముద మలర నీ పదంబులు వాడి మది గరఁగు
ఇది యెరిఁగి చన వెటుల నిచ్చేవోకాని

(॥వెలఁ॥)
నిను బయలు గాఁగిటను నించి కొంతపొద్దు జరపు
వినుకలినిఁ దనలోని విరహ ముడుపు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
ననుపులిఁక నెటువలెను నడపేవోకాని

(||pallavi||)
vĕlam̐di saṁdamulĕllā vinnaviṁchidi midigo
talam̐pĕrim̐gi manniṁchi dayam̐jūḍu mim̐kanu

(||vĕlam̐||)
sĕlulado nī kadalu sĕppi gŏṁta tanivŏṁdu
talabom̐talanum̐ gŏṁta tamagamārsu
kalalona nī rūba gani saṁtasiṁchugŏnu
kaligim̐ gām̐giḍa nĕbuḍu galasevogāni

(||vĕlam̐||)
pŏdali nī kĕduru sūbulam̐ gŏṁta sĕlarem̐gu
kadiyu radi veḍugalam̐ gām̐kalārsu
muda malara nī padaṁbulu vāḍi madi garam̐gu
idi yĕrim̐gi sana vĕḍula nichchevogāni

(||vĕlam̐||)
ninu bayalu gām̐giḍanu niṁchi kŏṁtabŏddu jarabu
vinugalinim̐ danaloni viraha muḍubu
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
nanubulim̐ka nĕḍuvalĕnu naḍabevogāni