వెలఁది చందము లెల్లా విన్నవించితిమి నీకు
(॥పల్లవి॥)
వెలఁది చందము లెల్లా విన్నవించితిమి నీకు
అలమేలుమంగపతి వాకెఁ జూచుకోవయ్య
(॥వెల॥)
వేరె నిన్నుఁ బాసి చెలి విరహపురవిపొంత
యీరెండలుగాసీని యేకతానను
కోరికైనఁ గేళాకూళిలోనఁ గొంతవడి
వూరేటిమైచెమటల నోలలాడీని
(॥వెల॥)
నెయ్యమున జవరాలు నీమీఁదితమకపు-
టుయ్యాలమంచముమీఁద నూఁగులాడీని
వొయ్యన నిన్ను మతిలో నూహించేచింతలనీడ
చయ్మన నీరతులకు సాముసేసీని
(॥వెల॥)
గోలయై యీసతి నిన్నుఁగూడిననిట్టూర్పుగాలి-
యాలవట్టములచేత నానందించీని
యేలితివి శ్రీవేంకటేశ యిట్టె నీ చేఁతలు
చాలుకొనఁగా నాటకసాల చూచీని
(||pallavi||)
vĕlam̐di saṁdamu lĕllā vinnaviṁchidimi nīgu
alamelumaṁgabadi vāgĕm̐ jūsugovayya
(||vĕla||)
verĕ ninnum̐ bāsi sĕli virahaburavibŏṁta
yīrĕṁḍalugāsīni yegadānanu
korigainam̐ geḽāgūḽilonam̐ gŏṁtavaḍi
vūreḍimaisĕmaḍala nolalāḍīni
(||vĕla||)
nĕyyamuna javarālu nīmīm̐didamagabu-
ṭuyyālamaṁchamumīm̐da nūm̐gulāḍīni
vŏyyana ninnu madilo nūhiṁchesiṁtalanīḍa
saymana nīradulagu sāmusesīni
(||vĕla||)
golayai yīsadi ninnum̐gūḍinaniṭṭūrbugāli-
yālavaṭṭamulaseda nānaṁdiṁchīni
yelidivi śhrīveṁkaḍeśha yiṭṭĕ nī sem̐talu
sālugŏnam̐gā nāḍagasāla sūsīni