(॥పల్లవి॥)
వెలఁది రచనలకు విసుగకుమీ
చెలువుఁడ చింతలే సిగ్గులు నాయె
(॥మోలఁది॥)
నలుగడఁ జెలి నిను నవ్విన నవ్వులు
దలఁచిన జంద్రోదయ మాయె
సొలసేటి కోపపుఁ జూపుల నంతలో
తళుకున సూర్యోదయ మాయె
(॥మోలఁది॥)
పడఁతి నీ యెదుటఁ బలికినపలుకులు
కడఁగి వసంతాగమ మాయె
పొడవగు నీపై బొమ్మజంకెనల
జడివాన కింద్రచాపము లాయె
(॥మోలఁది॥)
కాంత నిన్ను రతిఁ గలసినకౌఁగిలి
కంతుని సాముల గరి డాయె
యింతట శ్రీవేంకటేశ మీకరుణ
బంతి మీకు సరిపంతము లాయె
(||pallavi||)
vĕlam̐di rasanalagu visugagumī
sĕluvum̐ḍa siṁtale siggulu nāyĕ
(||molam̐di||)
nalugaḍam̐ jĕli ninu navvina navvulu
dalam̐sina jaṁdrodaya māyĕ
sŏlaseḍi kobabum̐ jūbula naṁtalo
taḽuguna sūryodaya māyĕ
(||molam̐di||)
paḍam̐ti nī yĕduḍam̐ baliginabalugulu
kaḍam̐gi vasaṁtāgama māyĕ
pŏḍavagu nībai bŏmmajaṁkĕnala
jaḍivāna kiṁdrasābamu lāyĕ
(||molam̐di||)
kāṁta ninnu radim̐ galasinagaum̐gili
kaṁtuni sāmula gari ḍāyĕ
yiṁtaḍa śhrīveṁkaḍeśha mīgaruṇa
baṁti mīgu saribaṁtamu lāyĕ