Velamdi nimka lebaveṟadumu nemaide

వెలఁది నింక లేపవెఱతుము నేమైతే
Language

(॥పల్లవి॥)
వెలఁది నింక లేపవెఱతుము నేమైతే
చెలువుఁడవు నీవే విచ్చేయవయ్య లోనికి

(॥॥)
కాంత, నీవు రాగానే కన్నులుమూసుక యిట్టె
పంతమున నిద్దిరించీఁ బానుపు మీఁద
చెంతల నేము దగ్గరి చేముట్టి లేపి తేను
వింతలుగా విదిలించివేసీఁ గోపానను

(॥॥)
అండ నీరాక చెప్పితే నప్పటి నీపచ్చడము
నిండా ముసుఁగువెట్టి నిద్దిరించీని
వుండలేక పాదమువట్టూఁచి పేరఁబిలిచితే
దిండుకట్టఁ జెప్పరానితిట్లు తిట్టీని

(॥॥)
సతి యలమేల్మంగ సారెకు గురుకవెట్టీ
తతి నీవు పైఁబడఁగాఁ దా నీలిగీని
కతగా శ్రీ వేంకటేశ కాఁగిలించి కూడితివి
రతిలో మేల్కనెఁదాను రవ్వాయ మాపనులు

(||pallavi||)
vĕlam̐di niṁka lebavĕṟadumu nemaide
sĕluvum̐ḍavu nīve vichcheyavayya lonigi

(||||)
kāṁta, nīvu rāgāne kannulumūsuga yiṭṭĕ
paṁtamuna niddiriṁchīm̐ bānubu mīm̐da
sĕṁtala nemu daggari semuṭṭi lebi tenu
viṁtalugā vidiliṁchivesīm̐ gobānanu

(||||)
aṁḍa nīrāga sĕppide nappaḍi nībachchaḍamu
niṁḍā musum̐guvĕṭṭi niddiriṁchīni
vuṁḍalega pādamuvaṭṭūm̐si peram̐biliside
diṁḍugaṭṭam̐ jĕpparānidiṭlu tiṭṭīni

(||||)
sadi yalamelmaṁga sārĕgu gurugavĕṭṭī
tadi nīvu paim̐baḍam̐gām̐ dā nīligīni
kadagā śhrī veṁkaḍeśha kām̐giliṁchi kūḍidivi
radilo melganĕm̐dānu ravvāya mābanulu