Velamdi nee radula veemga dimka

వెలఁది నీ రతుల వీఁగ దిఁక
Language

(॥పల్లవి॥)
వెలఁది నీ రతుల వీఁగ దిఁక
నిలువున నెమ్మెలు నెరపకువయ్యా

(॥వెల॥)
పలుమరు నీతో పంతము లాడఁగ
చెలియకుఁ గచుములు చేఁ గెక్కే
చలమునఁ బై కొని సాములు సేయఁగ
మొలకలపులకలు మొన లాయ

(॥వెల॥)
సరసము నీపైఁ జల్లఁగ జల్లఁగ
వరుస గోరికొన వాఁ డెక్కే
సరుగఁ గూరిమి గొసరఁగఁ గన్నుల
నిరతపు మెఱుఁగులు నిండె నవే

(॥వెల॥)
వొప్పుగ మేనులు వొరయఁగ మీకును
చిప్పిలుఁ జెమటల చితు కెక్కే
అప్పఁడ శ్రీవెంకటాధిప కూడితి
కప్పురగందికి కళ లవె మించే

(||pallavi||)
vĕlam̐di nī radula vīm̐ga dim̐ka
niluvuna nĕmmĕlu nĕrabaguvayyā

(||vĕla||)
palumaru nīdo paṁtamu lāḍam̐ga
sĕliyagum̐ gasumulu sem̐ gĕkke
salamunam̐ bai kŏni sāmulu seyam̐ga
mŏlagalabulagalu mŏna lāya

(||vĕla||)
sarasamu nībaim̐ jallam̐ga jallam̐ga
varusa gorigŏna vām̐ ḍĕkke
sarugam̐ gūrimi gŏsaram̐gam̐ gannula
niradabu mĕṟum̐gulu niṁḍĕ nave

(||vĕla||)
vŏppuga menulu vŏrayam̐ga mīgunu
sippilum̐ jĕmaḍala sidu kĕkke
appam̐ḍa śhrīvĕṁkaḍādhiba kūḍidi
kappuragaṁdigi kaḽa lavĕ miṁche