వెలలేని వలపుల వెనకముం దెంచుకోవు
(॥పల్లవి॥)
వెలలేని వలపుల వెనకముం దెంచుకోవు
చెలు లెమ్మె లేడనై నాఁ జెప్పుకొందురు సుమ్మీ
(॥॥)
సందడి నాపె తో నీవు సారె సారె నవ్వేవు
మందెమేళ మయ్యీఁ జుమ్మీ మగవాఁడవు
కందువ నాపె వద్దఁ గదిసి కూచుండేవు
అంది కొప్పు విరులు పై నట్టే రాలీఁ జుమ్మీ
(॥॥)
చెక్కు నొక్కియాపె నిట్టే చేరి వేఁడుకొనేవు
మొక్కితి వనేరు సుమ్మీ మొగవాఁడవు
పిక్కటిల్లుఁ జనుఁ గవ ప్రియముతోఁ బట్టేవు
చిక్కని చెమటలు నీచేత నంటీఁ జుమ్మీ
(॥॥)
తగిలియాపె కౌఁగిట తనియ వెంతైనాను
మొగచాటయ్యీఁ జుమ్మీ మొగవాఁడవు
నిగిడి శ్రీ వేంకటేశ నేఁ డిట్టె నన్నేలితివి
పగటున నాపె పొందు పచ్చిదేరీఁ జుమ్మీ
(||pallavi||)
vĕlaleni valabula vĕnagamuṁ dĕṁchugovu
sĕlu lĕmmĕ leḍanai nām̐ jĕppugŏṁduru summī
(||||)
saṁdaḍi nābĕ to nīvu sārĕ sārĕ navvevu
maṁdĕmeḽa mayyīm̐ jummī magavām̐ḍavu
kaṁduva nābĕ vaddam̐ gadisi kūsuṁḍevu
aṁdi kŏppu virulu pai naṭṭe rālīm̐ jummī
(||||)
sĕkku nŏkkiyābĕ niṭṭe seri vem̐ḍugŏnevu
mŏkkidi vaneru summī mŏgavām̐ḍavu
pikkaḍillum̐ janum̐ gava priyamudom̐ baṭṭevu
sikkani sĕmaḍalu nīseda naṁṭīm̐ jummī
(||||)
tagiliyābĕ kaum̐giḍa taniya vĕṁtainānu
mŏgasāḍayyīm̐ jummī mŏgavām̐ḍavu
nigiḍi śhrī veṁkaḍeśha nem̐ ḍiṭṭĕ nannelidivi
pagaḍuna nābĕ pŏṁdu pachchiderīm̐ jummī