వెలలేని గొల్లెతలే వేడుక గాక
(॥పల్లవి॥)
వెలలేని గొల్లెతలే వేడుక గాక
పిలువక వచ్చేవారు ప్రియ మయ్యేరా
(॥॥)
దొంతర చూపులు చూచి తొరలింపు మాటలాడి
పంతాలు గొనే సతులు దాఁతెయ్యేరా
వింతగా నవ్వులు నవ్వి వేడుకలు నీకు రేఁచి
చెంతఁ గాచుకుండేవారు చిత్తము వచ్చేరా
(॥॥)
పచ్చిదేరఁ జెనకుచు బాగాలు చేతి కిచ్చి
యిచ్చకము సేసేవారు ఇత వయ్యేరా
కొచ్చి కానుక లొసఁగి కొలువులు సారెఁజేసి
ముచ్చట లాడేవారు మచ్చి కయ్యేరా
(॥॥)
కన్నులనే నీకు మొక్కి కందువ నెదురు చూచి
సన్నల మెలఁగేవారు సమ్మతయ్యేరా
మన్నించి శ్రీ వేంకటేశ మమ్ము నిట్టే యేలితివి
వున్నవారల్లా నీకు నొద్ది కయ్యేరా
(||pallavi||)
vĕlaleni gŏllĕdale veḍuga gāga
piluvaga vachchevāru priya mayyerā
(||||)
dŏṁtara sūbulu sūsi tŏraliṁpu māḍalāḍi
paṁtālu gŏne sadulu dām̐tĕyyerā
viṁtagā navvulu navvi veḍugalu nīgu rem̐si
sĕṁtam̐ gāsuguṁḍevāru sittamu vachcherā
(||||)
pachchideram̐ jĕnagusu bāgālu sedi kichchi
yichchagamu sesevāru ida vayyerā
kŏchchi kānuga lŏsam̐gi kŏluvulu sārĕm̐jesi
muchchaḍa lāḍevāru machchi kayyerā
(||||)
kannulane nīgu mŏkki kaṁduva nĕduru sūsi
sannala mĕlam̐gevāru sammadayyerā
manniṁchi śhrī veṁkaḍeśha mammu niṭṭe yelidivi
vunnavārallā nīgu nŏddi kayyerā