Velaledu podduledu vegirimcheeni

వేళలేదు పొద్దులేదు వేగిరించీని
Language

(॥పల్లవి॥)
వేళలేదు పొద్దులేదు వేగిరించీని
వోలవేసీఁ జూపులనే వూరకున్న మానఁడు

(॥వేళ॥)
అంతేపో వోయమ్మ అదేమే వీఁడు
వింతవావి నామీఁద వేసి నవ్వీని
యెంతయినఁ బోనీఁడు యెంగిలిమోవి మాఁటలు
దొంతులు వేరుచవచ్చీ తొలమన్నా మానఁడు

(॥వేళ॥)
పోపో అదేడమాఁట పొద్దువోదటే
రేపుమాపు రమ్మంటా రేసు చల్లీని
వోపనన్నఁ బోనీఁడు వుంబడిపొత్తు చేతుల
మోఁపవచ్చీ నాకుచాల మొక్కినాను మానఁడు

(॥వేళ॥)
తగునే యేమని చెప్పె తానే వీఁడు
మెగమోడితేనే చేయి ముంచి కూడెను
నిగిడి శ్రీవేంటాద్రినిలయుఁడు నన్నుఁ గూడి
సగము సరసమాడి చాలునన్న మానఁడు

(||pallavi||)
veḽaledu pŏdduledu vegiriṁchīni
volavesīm̐ jūbulane vūragunna mānam̐ḍu

(||veḽa||)
aṁtebo voyamma ademe vīm̐ḍu
viṁtavāvi nāmīm̐da vesi navvīni
yĕṁtayinam̐ bonīm̐ḍu yĕṁgilimovi mām̐ṭalu
dŏṁtulu verusavachchī tŏlamannā mānam̐ḍu

(||veḽa||)
pobo adeḍamām̐ṭa pŏdduvodaḍe
rebumābu rammaṁṭā resu sallīni
vobanannam̐ bonīm̐ḍu vuṁbaḍibŏttu sedula
mom̐pavachchī nāgusāla mŏkkinānu mānam̐ḍu

(||veḽa||)
tagune yemani sĕppĕ tāne vīm̐ḍu
mĕgamoḍidene seyi muṁchi kūḍĕnu
nigiḍi śhrīveṁṭādrinilayum̐ḍu nannum̐ gūḍi
sagamu sarasamāḍi sālunanna mānam̐ḍu