వేళలేదు పొద్దులేదు వేగిరించే వింతలోన
(॥పల్లవి॥)
వేళలేదు పొద్దులేదు వేగిరించే వింతలోన
నీ లాగు లెఱఁగరు నిందలాడేరు
(॥వేళ॥)
చెక్కులు నొక్కకుమీ చేతిగోరు నాటుఁజేసు
యెక్కువ మావారు చూచి యేడదనేరు
పక్కన నవ్వకుమీ పడఁతు లింద రున్నారు
చక్కఁగా నిందరిలోన సందేహించేరు
(॥వేళ॥)
మించి పై నొరగకుమీ మేనితావు లంటుఁ జేసు
అంచెలఁ జుట్టాలు పక్కా లాడుకొనేరు
మంచానకుఁ దియ్యకుమీ మరి తుము చదరి
చుంచుల మాయత్తవారు చొప్పునట్టేరు
(॥వేళ॥)
బెట్టిమాట లాడకుమీ పిమ్మట రట్టౌఁ జేసు
పొట్టఁ బొరుగువారెల్లఁ బొంచు వినేరు
గట్టిగా శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి విట్టె
పట్టి నీ మాయ కిందరు భ్రమశున్నారు
(||pallavi||)
veḽaledu pŏdduledu vegiriṁche viṁtalona
nī lāgu lĕṟam̐garu niṁdalāḍeru
(||veḽa||)
sĕkkulu nŏkkagumī sedigoru nāḍum̐jesu
yĕkkuva māvāru sūsi yeḍadaneru
pakkana navvagumī paḍam̐tu liṁda runnāru
sakkam̐gā niṁdarilona saṁdehiṁcheru
(||veḽa||)
miṁchi pai nŏragagumī menidāvu laṁṭum̐ jesu
aṁchĕlam̐ juṭṭālu pakkā lāḍugŏneru
maṁchānagum̐ diyyagumī mari tumu sadari
suṁchula māyattavāru sŏppunaṭṭeru
(||veḽa||)
bĕṭṭimāḍa lāḍagumī pimmaḍa raṭṭaum̐ jesu
pŏṭṭam̐ bŏruguvārĕllam̐ bŏṁchu vineru
gaṭṭigā śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi viṭṭĕ
paṭṭi nī māya kiṁdaru bhramaśhunnāru