(॥పల్లవి॥)
వేళగానివేళ వచ్చి వెదకేవు
యేలిన రమణునితో నింత రట్టు గలదా
(॥వేళ గాని॥)
యేచిన నీనాయకుఁడు యింట నున్నాఁ డంటావచ్చి
చూచేవు నలుదిక్కులు సోదించి
యీచాయ నుండె నాతఁడు యిట్టె పిలుచుక వచ్చేఁ
గూచుండవమ్మా నీవు కోపగించుకొనకా
(॥వేళ గాని॥)
వొద్ద నెవ్వతెఁ బెట్టుక వున్నాఁడో యనుచు
నద్దమరేతిరి పొంచు లాలకించేవు
నిద్దురతో నెం దున్నాఁడో నే నతనిఁ దోడితెంచే
వద్దు వీడె మిందవమ్మ వట్టిచల మేఁటికి
(॥వేళ గాని॥)
మామాట వినక నీవు మాడుపుటింటిలో చొచ్చి
కామించి శ్రీవెంకటేశుఁగని కూడితి
యే మమ్మ అలమేల్ మంగ యింటికే యీతనిఁ దెచ్చే
ప్రేమాన నా వెంట రావో పెనఁగించుకొనకా
(||pallavi||)
veḽagāniveḽa vachchi vĕdagevu
yelina ramaṇunido niṁta raṭṭu galadā
(||veḽa gāni||)
yesina nīnāyagum̐ḍu yiṁṭa nunnām̐ ḍaṁṭāvachchi
sūsevu naludikkulu sodiṁchi
yīsāya nuṁḍĕ nādam̐ḍu yiṭṭĕ pilusuga vachchem̐
gūsuṁḍavammā nīvu kobagiṁchugŏnagā
(||veḽa gāni||)
vŏdda nĕvvadĕm̐ bĕṭṭuga vunnām̐ḍo yanusu
naddamarediri pŏṁchu lālagiṁchevu
niddurado nĕṁ dunnām̐ḍo ne nadanim̐ doḍidĕṁche
vaddu vīḍĕ miṁdavamma vaṭṭisala mem̐ṭigi
(||veḽa gāni||)
māmāḍa vinaga nīvu māḍubuḍiṁṭilo sŏchchi
kāmiṁchi śhrīvĕṁkaḍeśhum̐gani kūḍidi
ye mamma alamel maṁga yiṁṭige yīdanim̐ dĕchche
premāna nā vĕṁṭa rāvo pĕnam̐giṁchugŏnagā