Velagaadu siggulagu vichchanavidimte kaani

వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని
Language

(॥పల్లవి॥)
వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని
గోలతన మిపుడేలే కొంగువట్టీ నతఁడు

(॥వేళ॥)
తమకించినపుడే తతియాయ రతులకు
సుముఖుఁడైనపుడే సూటి మాటకు
చెమరించినపుడే చేఁతలకెల్లా లోను
కొమరెవేల లోఁగేవే కొంగువట్టీ నతఁడు

(॥వేళ॥)
అంటఁజూచినపుడే అద నట్టే నవ్వులకు
వెంటవచ్చినపుడే విందు మోవికి
నంటు సేసుకొన్నపుడే నయము కోరికలకు
దంటవు యేల కొంకేవే దక్కఁగొనీ నతఁడు

(॥వేళ॥)
ఆయములంటినప్పుడే అనువు నీపంతాలకు
చాయసేసుకొన్నపుడే చవి కాఁగిలి
యీయెడ నలమేల్మంగ ఇదిగొ శ్రీవేంకటేశు-
నోయమ్మ కూడితివి నీవొడివట్టె నతఁడు

(||pallavi||)
veḽagādu siggulagu vichchanaviḍiṁte kāni
goladana mibuḍele kŏṁguvaṭṭī nadam̐ḍu

(||veḽa||)
tamagiṁchinabuḍe tadiyāya radulagu
sumukhum̐ḍainabuḍe sūḍi māḍagu
sĕmariṁchinabuḍe sem̐talagĕllā lonu
kŏmarĕvela lom̐geve kŏṁguvaṭṭī nadam̐ḍu

(||veḽa||)
aṁṭam̐jūsinabuḍe ada naṭṭe navvulagu
vĕṁṭavachchinabuḍe viṁdu movigi
naṁṭu sesugŏnnabuḍe nayamu korigalagu
daṁṭavu yela kŏṁkeve dakkam̐gŏnī nadam̐ḍu

(||veḽa||)
āyamulaṁṭinappuḍe anuvu nībaṁtālagu
sāyasesugŏnnabuḍe savi kām̐gili
yīyĕḍa nalamelmaṁga idigŏ śhrīveṁkaḍeśhu-
noyamma kūḍidivi nīvŏḍivaṭṭĕ nadam̐ḍu