Vela raanee meegu nitte vegira mele

వేళ రానీ మీకు నిట్టే వేగిర మేలే
Language

(॥పల్లవి॥)
వేళ రానీ మీకు నిట్టే వేగిర మేలే
కూళఁ గాను మీరింతలోఁ గొండెము చెప్పకురే

(॥వేళ॥)
ఆత డెంత సేసినాను అట్టె వోరుచుక వుంటే
నాతోడి చెలులే నన్ను నవ్వేరే
చేతఁగానిదానఁ గాను చెలువుని సరితలు
చూతమంటా నున్నదాన సుద్దులు చెప్పకురే

(॥వేళ॥)
వివరించి రమణుని వేసాలు దెలుసుకొంటే
సవతులుమీలో నేల సన్న సేసేరే
తివిరేటిదానఁ గాను దిట్టతన మితనిది
జవకట్టే నింతే మీకు జాణతనా లేలే

(॥వేళ॥)
కొచ్చి శ్రీవేంకటేశుఁడు కూడఁగా నేఁ బైకొంటే
ముచ్చటగా సతులేల మోము చూచేరే
పచ్చి సేసేదానఁ గాను బలువుఁ డాతనిమేలు
కచ్చు పెట్టుకున్న దాన కాఁక రేఁచ నేలే

(||pallavi||)
veḽa rānī mīgu niṭṭe vegira mele
kūḽam̐ gānu mīriṁtalom̐ gŏṁḍĕmu sĕppagure

(||veḽa||)
āda ḍĕṁta sesinānu aṭṭĕ vorusuga vuṁṭe
nādoḍi sĕlule nannu navvere
sedam̐gānidānam̐ gānu sĕluvuni saridalu
sūdamaṁṭā nunnadāna suddulu sĕppagure

(||veḽa||)
vivariṁchi ramaṇuni vesālu dĕlusugŏṁṭe
savadulumīlo nela sanna sesere
tivireḍidānam̐ gānu diṭṭadana midanidi
javagaṭṭe niṁte mīgu jāṇadanā lele

(||veḽa||)
kŏchchi śhrīveṁkaḍeśhum̐ḍu kūḍam̐gā nem̐ baigŏṁṭe
muchchaḍagā sadulela momu sūsere
pachchi sesedānam̐ gānu baluvum̐ ḍādanimelu
kachchu pĕṭṭugunna dāna kām̐ka rem̐sa nele