Vela gaadu pogure velamdulu lobaligi

వేళ గాదు పోకురే వెలఁదులు లోపలికి
Language

(॥పల్లవి॥)
వేళ గాదు పోకురే వెలఁదులు లోపలికి
మేలిమిఁ దా మిద్దరే మేడపై నున్నారు

(॥వేళ॥)
వాడుఁ బువ్వులకొప్పుతో వన్నెల మోవులతోడ
తోడఁ జిట్లు గందాల దుమ్ములతోడ
వీడెపు సెలవులతో విభుఁడు తాను నద్దపు
నీడలు చూచుకొంటా నిలుచున్నా రదివో

(॥వేళ॥)
చిఱుఁ జెమటలు గార సిగ్గుల నవుల దేర
నెఱుల చిక్కులు దీసి నివురుకొంటా
గిఱుకుఁ గన్నుల నిద్రకేఁ గేలఁబులుముకొంటా
మొఱఁగుల నవ్వులతో ముచ్చటాడే రదివో

(॥వేళ॥)
తిమిరి వొక్కరొక్కరు తేటలమోములు చూచి
సమమోహములు పైపై జల్లుకొంటాను
అమర శ్రీవేంకటేశుఁ డలమేల్మంగయుఁ దాను
తమిఁ గూడి లోలోన దైవారే రదివో

(||pallavi||)
veḽa gādu pogure vĕlam̐dulu lobaligi
melimim̐ dā middare meḍabai nunnāru

(||veḽa||)
vāḍum̐ buvvulagŏppudo vannĕla movuladoḍa
toḍam̐ jiṭlu gaṁdāla dummuladoḍa
vīḍĕbu sĕlavulado vibhum̐ḍu tānu naddabu
nīḍalu sūsugŏṁṭā nilusunnā radivo

(||veḽa||)
siṟum̐ jĕmaḍalu gāra siggula navula dera
nĕṟula sikkulu dīsi nivurugŏṁṭā
giṟugum̐ gannula nidragem̐ gelam̐bulumugŏṁṭā
mŏṟam̐gula navvulado muchchaḍāḍe radivo

(||veḽa||)
timiri vŏkkarŏkkaru teḍalamomulu sūsi
samamohamulu paibai jallugŏṁṭānu
amara śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgayum̐ dānu
tamim̐ gūḍi lolona daivāre radivo