వెక్కసపు వలపుల విఱ్ఱవీఁగేవు
(॥పల్లవి॥)
వెక్కసపు వలపుల విఱ్ఱవీఁగేవు
మక్కువలు మారుకొంటే మఱి యేమి సేసేవే
(॥॥)
యింతులెల్లా నుండగాను యేకతము నీ వాడేవు
చెంత నుండి విభునికి సేవ సేసేవు
యెంత కెత్తు కొంటివే నీ వించుకాఁ దగవెంచవు
యింతలో దొమ్మి సేసితే నేమి సేసేవే
(॥॥)
సరివారిలోననెల్లా చనవుల నెరుపేవు
గరిమ నాతనితోడ గడునవ్వేవు
దొరతన మెంత గద్దే తోడి వారి గైకోవు
నిరతి దొమ్మి గూడితే నీవేమి సేసేవే
(॥॥)
కావరించి చెనకేవు కాగిటనుఁ గూడేవు
శ్రీవేంకటేశ్వరునిఁ జెలగించేవు
దేవుల వౌదువే ఆ దేవుడే మమ్మును నేలె
యీ విధాన సంతమైతే నిక నేమి సేసేవే
(||pallavi||)
vĕkkasabu valabula viṭravīm̐gevu
makkuvalu mārugŏṁṭe maṟi yemi seseve
(||||)
yiṁtulĕllā nuṁḍagānu yegadamu nī vāḍevu
sĕṁta nuṁḍi vibhunigi seva sesevu
yĕṁta kĕttu kŏṁṭive nī viṁchugām̐ dagavĕṁchavu
yiṁtalo dŏmmi seside nemi seseve
(||||)
sarivārilonanĕllā sanavula nĕrubevu
garima nādanidoḍa gaḍunavvevu
dŏradana mĕṁta gadde toḍi vāri gaigovu
niradi dŏmmi gūḍide nīvemi seseve
(||||)
kāvariṁchi sĕnagevu kāgiḍanum̐ gūḍevu
śhrīveṁkaḍeśhvarunim̐ jĕlagiṁchevu
devula vauduve ā devuḍe mammunu nelĕ
yī vidhāna saṁtamaide niga nemi seseve