Vegirimtunaa yemta vesada galiginaanu

వేగిరింతునా యెంత వేసట గలిగినాను
Language

(॥పల్లవి॥)
వేగిరింతునా యెంత వేసట గలిగినాను
చేగదేరితే వలపు చిమ్మి రేఁగీఁగాక

(॥వేగి॥)
యెక్కడనైనాఁ బతి యేమి సేసి వచ్చినాను
వెక్కసాలాడవచ్చునా వెలఁదికిని
పెక్కులాఁగులఁ బెనఁగి ప్రియములు చెప్పఁగాను
మక్కువ నాతఁడే మరి మన్నించీఁగాక

(॥వేగి॥)
నెట్టన నాతని మేన నిండా గురుతు లుండినా
పట్టి చూపవచ్చునా పడఁతికిని
గుట్టుతోడనే వుండి కొలువులు సేయఁగాను
జట్టిగొని యాతఁడే చనవిచ్చీఁగాక

(॥వేగి॥)
యెలమి శ్రీ వేంకటేశుఁ డెంత రతిఁ గదిమినా
అలఇంచవచ్చునా అంగనకును
మెలఁగి నావలెఁ గూడి మేర మీరకుండఁగాను
చలువఁగాఁ దానే మోవి చవిచూపీఁగాక

(||pallavi||)
vegiriṁtunā yĕṁta vesaḍa galiginānu
segaderide valabu simmi rem̐gīm̐gāga

(||vegi||)
yĕkkaḍanainām̐ badi yemi sesi vachchinānu
vĕkkasālāḍavachchunā vĕlam̐digini
pĕkkulām̐gulam̐ bĕnam̐gi priyamulu sĕppam̐gānu
makkuva nādam̐ḍe mari manniṁchīm̐gāga

(||vegi||)
nĕṭṭana nādani mena niṁḍā gurudu luṁḍinā
paṭṭi sūbavachchunā paḍam̐tigini
guṭṭudoḍane vuṁḍi kŏluvulu seyam̐gānu
jaṭṭigŏni yādam̐ḍe sanavichchīm̐gāga

(||vegi||)
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍĕṁta radim̐ gadiminā
ala̮iṁchavachchunā aṁganagunu
mĕlam̐gi nāvalĕm̐ gūḍi mera mīraguṁḍam̐gānu
saluvam̐gām̐ dāne movi savisūbīm̐gāga