Vegirimtu ninnaallu vetridaananai ninnu

వేగిరింతు నిన్నాళ్ళు వెఱ్ఱిదాననై నిన్ను
Language

(॥పల్లవి॥)
వేగిరింతు నిన్నాళ్ళు వెఱ్ఱిదాననై నిన్ను
నీ గురుతుదాననై నిండుకుండేఁ జాలును

(॥వేగి॥)
మాపుదాఁకానే నెంత మతి నిన్నుఁగోరినాను
రాఁపుల నీచిత్తము రావలెఁగా
యేపున నిన్ను దూరి యెందాఁకా వేసరించేను
కైపగు నీ చెలులతోఁ గడనుండేఁ జాలును

(॥వేగి॥)
తల్లి డించి నీకు గానే తప మెంత సేసి నాను
పొల్లులేని దయ నీకు బుట్టి వలెఁగా
ఇల్లిదె బలిమి వల పెటువలె నీడేరు
వొల్ల నాలనైన నీవద్ద నుండే జాలును

(॥వేగి॥)
కమ్మటి నేనే నిన్ను కాఁగిట బిగించినాను
సమ్మతించి అప్ప ణియ్యఁ జాల వలెఁగా
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతసేసి కూడితివి
రమ్మనిపంచుక నీతో రతికెక్కేఁ జాలును

(||pallavi||)
vegiriṁtu ninnāḽḽu vĕṭridānanai ninnu
nī gurududānanai niṁḍuguṁḍem̐ jālunu

(||vegi||)
mābudām̐kāne nĕṁta madi ninnum̐gorinānu
rām̐pula nīsittamu rāvalĕm̐gā
yebuna ninnu dūri yĕṁdām̐kā vesariṁchenu
kaibagu nī sĕluladom̐ gaḍanuṁḍem̐ jālunu

(||vegi||)
talli ḍiṁchi nīgu gāne taba mĕṁta sesi nānu
pŏlluleni daya nīgu buṭṭi valĕm̐gā
illidĕ balimi vala pĕḍuvalĕ nīḍeru
vŏlla nālanaina nīvadda nuṁḍe jālunu

(||vegi||)
kammaḍi nene ninnu kām̐giḍa bigiṁchinānu
sammadiṁchi appa ṇiyyam̐ jāla valĕm̐gā
yimmula śhrī veṁkaḍeśha yiṁtasesi kūḍidivi
rammanibaṁchuga nīdo radigĕkkem̐ jālunu