వేగిరించి యాతనికి వేసట సేయకురే
(॥పల్లవి॥)
వేగిరించి యాతనికి వేసట సేయకురే
నా గుఱు తెఱుఁగుఁ దానే నన్ను నేలీఁ గాని
(॥॥)
ఆస కొలిపిన వాఁడు ఆఱడిఁ బెట్టిన వాఁడు
సేస వెట్టి నాపై దయ సేయ నేరఁడా
వాసి యెఱిఁగిన వాఁడు వలపు చల్లినవాఁడు
లాసుకొన్న నన్నుఁ గూడి లాలించీఁ గాక
(॥॥)
చనవు లిచ్చిన వాఁడు చవి మరపిన వాఁడు
చెనకి సంతోసించఁ జేయ నేరఁడా
వినయ మెఱిఁ నవాఁడు వేడుకకు లోనై నవాఁడు
మన సెఱిఁగి నన్నిట్టే మన్నించీఁ గాక
(॥॥)
చెలిమి సేసిన వాఁడు చేతికి లోనైనవాఁడు
తలఁ చినప్పుడే నా దండకు రాఁడా
యెలమి శ్రీ వేంకటేశుఁడింత లోనే నన్నుఁగూడే
పలుమారు నా రతులఁ బాయకుండీఁ గాకా
(||pallavi||)
vegiriṁchi yādanigi vesaḍa seyagure
nā guṟu tĕṟum̐gum̐ dāne nannu nelīm̐ gāni
(||||)
āsa kŏlibina vām̐ḍu āṟaḍim̐ bĕṭṭina vām̐ḍu
sesa vĕṭṭi nābai daya seya neram̐ḍā
vāsi yĕṟim̐gina vām̐ḍu valabu sallinavām̐ḍu
lāsugŏnna nannum̐ gūḍi lāliṁchīm̐ gāga
(||||)
sanavu lichchina vām̐ḍu savi marabina vām̐ḍu
sĕnagi saṁtosiṁcham̐ jeya neram̐ḍā
vinaya mĕṟim̐ navām̐ḍu veḍugagu lonai navām̐ḍu
mana sĕṟim̐gi nanniṭṭe manniṁchīm̐ gāga
(||||)
sĕlimi sesina vām̐ḍu sedigi lonainavām̐ḍu
talam̐ sinappuḍe nā daṁḍagu rām̐ḍā
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍiṁta lone nannum̐gūḍe
palumāru nā radulam̐ bāyaguṁḍīm̐ gāgā