వేగిరించేవిదే నీకు వెంగెమాయనా
(॥పల్లవి॥)
వేగిరించేవిదే నీకు వెంగెమాయనా
చేగదేర వలపులు చెప్పవలెనా
(॥వేగి॥)
మొక్కితేనే చాలదా మోనమునఁ జెలి నీకు
అక్కజముగా మాటలాడవలెనా
తొక్కితేనే చాలదా తొడరి నీపాదము
పెక్కుమారులిట్టే సేసవెట్టవలెనా
(॥వేగి॥)
నవ్వితేనే చాలదా నాతి నీయెదుటనుండి
చివ్వన నప్పటి సేవసేయవలెనా
పవ్వళించెఁ జాలదా పక్కన నీతోడమీఁద
వువ్విళ్లూరఁ గుచముల నొత్తవలెనా
(॥వేగి॥)
కూడితేనే చాలదా కొమ్మ కాఁగిట నేఁడు
మేడెపురతుల నిన్ను మెచ్చవలెనా
వేడుకతో నీవును శ్రీవేంకటేశ యేలితివి
వీడెమిచ్చే నింత వెల్లవిరి వలెనా
(||pallavi||)
vegiriṁchevide nīgu vĕṁgĕmāyanā
segadera valabulu sĕppavalĕnā
(||vegi||)
mŏkkidene sāladā monamunam̐ jĕli nīgu
akkajamugā māḍalāḍavalĕnā
tŏkkidene sāladā tŏḍari nībādamu
pĕkkumāruliṭṭe sesavĕṭṭavalĕnā
(||vegi||)
navvidene sāladā nādi nīyĕduḍanuṁḍi
sivvana nappaḍi sevaseyavalĕnā
pavvaḽiṁchĕm̐ jāladā pakkana nīdoḍamīm̐da
vuvviḽlūram̐ gusamula nŏttavalĕnā
(||vegi||)
kūḍidene sāladā kŏmma kām̐giḍa nem̐ḍu
meḍĕburadula ninnu mĕchchavalĕnā
veḍugado nīvunu śhrīveṁkaḍeśha yelidivi
vīḍĕmichche niṁta vĕllaviri valĕnā