Vegirimchenaa neevu vimtavaamdavaa

వేగిరించేనా నీవు వింతవాఁడవా
Language

(॥పల్లవి॥)
వేగిరించేనా నీవు వింతవాఁడవా
సాగిలి నీకు మొక్కితే చక్కనయ్యీ పనులు

(॥వేగి॥)
పొందులు సేసి నిన్నుఁ బొగడుట మేలుగాక
యిందరిలో నిన్ను నేరాలెంచనేఁటికి
యిందుముఖులము నేము యిచ్చకములేయాడి
సందడి నీకు మొక్కితే చక్కనయ్యీ పనులు

(॥వేగి॥)
సరసములాడి నీకే సమ్మతౌట మేలుగాక
గరిసించేయట్టి జగడమేఁటికి
తరుణులము నేము నీతలఁపులోనే మెలఁగి
సరుగ నీకు మొక్కితే చక్కనయ్యీ పనులు

(॥వేగి॥)
కొల్లున నీతో నవ్వి కూడుట మేలుగాక
కెల్లురేఁగి నిన్ను విసుగించనేఁటికి
యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చల్లఁగా నీకు మొక్కఁగ చక్కనయ్యీ పనులు

(||pallavi||)
vegiriṁchenā nīvu viṁtavām̐ḍavā
sāgili nīgu mŏkkide sakkanayyī panulu

(||vegi||)
pŏṁdulu sesi ninnum̐ bŏgaḍuḍa melugāga
yiṁdarilo ninnu nerālĕṁchanem̐ṭigi
yiṁdumukhulamu nemu yichchagamuleyāḍi
saṁdaḍi nīgu mŏkkide sakkanayyī panulu

(||vegi||)
sarasamulāḍi nīge sammadauḍa melugāga
garisiṁcheyaṭṭi jagaḍamem̐ṭigi
taruṇulamu nemu nīdalam̐pulone mĕlam̐gi
saruga nīgu mŏkkide sakkanayyī panulu

(||vegi||)
kŏlluna nīdo navvi kūḍuḍa melugāga
kĕllurem̐gi ninnu visugiṁchanem̐ṭigi
yillidĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
sallam̐gā nīgu mŏkkam̐ga sakkanayyī panulu