వేగిరించే విదియేమి వేవేలుసతు లుండఁగ
(॥పల్లవి॥)
వేగిరించే విదియేమి వేవేలుసతు లుండఁగ
నీ గుణాలు మంచివౌత నేఁడే చూపవలెనా
(॥వేగి॥)
సిగ్గువడి వుండఁగానే చేయివట్టి తీసేవు
దగ్గరివచ్చినవేళ తడవరాదా
నిగ్గు నించుకవడి నిలిచితేనే వలపు
వెగ్గళించి ఇంతలోనే వెల్లివిరిసీనా
(॥వేగి॥)
జలకేళి సేయఁగానే సారెఁ జేయిచాఁచేవు
పిలిచినప్పుడే వచ్చి పెనఁగరాదా
వెలయ వించుకవడి వేళగాచుకుండితేను
యెలమి జవ్వనమద మెదురుదొట్టీనా
(॥వేగి॥)
గుట్టుతోడ నుండఁగానే కూడితి శ్రీవేంకటేశ
పట్టితే నలమేల్మంగఁ బై కొనరాదా
యిట్టె యాపెయిచ్చలో నెనసితే నేమాయ
బెట్టుగా నీపెండ్లి వచ్చి పెళ్ల విడిశున్నదా
(||pallavi||)
vegiriṁche vidiyemi vevelusadu luṁḍam̐ga
nī guṇālu maṁchivauda nem̐ḍe sūbavalĕnā
(||vegi||)
sigguvaḍi vuṁḍam̐gāne seyivaṭṭi tīsevu
daggarivachchinaveḽa taḍavarādā
niggu niṁchugavaḍi nilisidene valabu
vĕggaḽiṁchi iṁtalone vĕllivirisīnā
(||vegi||)
jalageḽi seyam̐gāne sārĕm̐ jeyisām̐sevu
pilisinappuḍe vachchi pĕnam̐garādā
vĕlaya viṁchugavaḍi veḽagāsuguṁḍidenu
yĕlami javvanamada mĕdurudŏṭṭīnā
(||vegi||)
guṭṭudoḍa nuṁḍam̐gāne kūḍidi śhrīveṁkaḍeśha
paṭṭide nalamelmaṁgam̐ bai kŏnarādā
yiṭṭĕ yābĕyichchalo nĕnaside nemāya
bĕṭṭugā nībĕṁḍli vachchi pĕḽla viḍiśhunnadā