Vegirimchanemidigi velamdulaala

వేగిరించనేమిటికి వెలఁదులాల
Language

(॥పల్లవి॥)
వేగిరించనేమిటికి వెలఁదులాల
యే గతినైనా నన్ను నేలీ నాతఁడు

(॥వేగి॥)
మాటాడితేఁ గానరాదా మనసు సొదించనేల
గాఁటపునీవిభుని బత్తి గలదల్లాను
చీటికిమాటికినేల సేసేరే విన్నపాలు
తాటించి తానే నాపై దయసేసీ నాతఁడు

(॥వేగి॥)
మోమెత్తితేఁ దెలియదా ముదులకించఁగనేల
చేముంచి ఆతఁడు సేసేచేఁతలెల్లాను
ప్రేమతో నెందాఁకాఁ బెనఁగుచుఁ బిలిచేరే
కామించి నాయకుఁ డిట్టె కరుణించీఁగాక

(॥వేగి॥)
చూచితే నెఱఁగరాదా సుద్దు లడుగనేల
యేచి శ్రీవేంకటేశ్వరునింపులెల్లాను
కాచి యలమేల్‌మంగనినేల సొలసేరే
లాచి నన్నుఁగూడె నింకా లాలించీఁగాక

(||pallavi||)
vegiriṁchanemiḍigi vĕlam̐dulāla
ye gadinainā nannu nelī nādam̐ḍu

(||vegi||)
māḍāḍidem̐ gānarādā manasu sŏdiṁchanela
gām̐ṭabunīvibhuni batti galadallānu
sīḍigimāḍiginela sesere vinnabālu
tāḍiṁchi tāne nābai dayasesī nādam̐ḍu

(||vegi||)
momĕttidem̐ dĕliyadā mudulagiṁcham̐ganela
semuṁchi ādam̐ḍu sesesem̐talĕllānu
premado nĕṁdām̐kām̐ bĕnam̐gusum̐ bilisere
kāmiṁchi nāyagum̐ ḍiṭṭĕ karuṇiṁchīm̐gāga

(||vegi||)
sūside nĕṟam̐garādā suddu laḍuganela
yesi śhrīveṁkaḍeśhvaruniṁpulĕllānu
kāsi yalamel‌maṁganinela sŏlasere
lāsi nannum̐gūḍĕ niṁkā lāliṁchīm̐gāga