వేగిరించఁ బనిలేదు విభునితోను
(॥పల్లవి॥)
వేగిరించఁ బనిలేదు విభునితోను
చేగదేర నవ్వితేనే చేతఁ జిక్కు నితఁడు
(॥వేగి॥)
వాసులెల్లా రేఁచీని వలపుల లోఁచీని
వేసరకువే నీవు విభునితోను
ఆసలు నీకు గనము ఆతఁడు నీపై బత్తి
సేసినట్టు సేసితేను చేతఁ జిక్కు నితఁడు
(॥వేగి॥)
మంతనాలెల్లా నాడీని మనసులు సోదించీని
వింత లిఁకఁ జేయకువే విభునితోను
పంతము నీ విచ్చితివి పాయలేఁడు నిన్నతఁడు
చెంతనే కాఁచుకుండితే చేఁతఁ జిక్కు నతఁడు
(॥వేగి॥)
సరసములాడీని సారె నిన్నుఁ గూడీని
విరసాలేవే శ్రీ వేంకటేశుతో
మరిగిన దేవులవు మగఁడు నీకు నతఁడు
శిరసువంచి మొక్కితే చేతఁజిక్కు నతఁడు
(||pallavi||)
vegiriṁcham̐ baniledu vibhunidonu
segadera navvidene sedam̐ jikku nidam̐ḍu
(||vegi||)
vāsulĕllā rem̐sīni valabula lom̐sīni
vesaraguve nīvu vibhunidonu
āsalu nīgu ganamu ādam̐ḍu nībai batti
sesinaṭṭu sesidenu sedam̐ jikku nidam̐ḍu
(||vegi||)
maṁtanālĕllā nāḍīni manasulu sodiṁchīni
viṁta lim̐kam̐ jeyaguve vibhunidonu
paṁtamu nī vichchidivi pāyalem̐ḍu ninnadam̐ḍu
sĕṁtane kām̐suguṁḍide sem̐tam̐ jikku nadam̐ḍu
(||vegi||)
sarasamulāḍīni sārĕ ninnum̐ gūḍīni
virasāleve śhrī veṁkaḍeśhudo
marigina devulavu magam̐ḍu nīgu nadam̐ḍu
śhirasuvaṁchi mŏkkide sedam̐jikku nadam̐ḍu