వేగిరించకురే వో వెలఁదులాల
(॥పల్లవి॥)
వేగిరించకురే వో వెలఁదులాల
చేగదేర వేరొకటి సేసునా అతఁడు
(॥॥)
తనకు మోహించే నాపై దయ తలఁచుఁ గాక
నను నిరాకరించునా నా విభుఁడు
పనులేమి గలిగి యే పసల నున్నాఁడో కాక
మనసున నాపై బత్తి మఱచునా అతఁడు
(॥॥)
నంటునఁ బెండ్లాడిన నన్ను మన్నించుఁ గాక
యింటికి రా కుండునా యెప్పుడైనాను
అంటిత నాడకు వచ్చేనని వున్నాఁడోకాక
దంటయై యవ్వలిపని దలఁచునా అతఁడు
(॥॥)
తానే గతై వుండే నాకు తగఁ జన విచ్చుఁ గాక
మానఁగలఁ డా కూడక మరి నాతోను
పానుపుపై శ్రీ వేంకటపతి వున్నాడో కాక
యేననఁ గా నన్ను నేలె యింతలోనె యతఁడు
(||pallavi||)
vegiriṁchagure vo vĕlam̐dulāla
segadera verŏgaḍi sesunā adam̐ḍu
(||||)
tanagu mohiṁche nābai daya talam̐sum̐ gāga
nanu nirāgariṁchunā nā vibhum̐ḍu
panulemi galigi ye pasala nunnām̐ḍo kāga
manasuna nābai batti maṟasunā adam̐ḍu
(||||)
naṁṭunam̐ bĕṁḍlāḍina nannu manniṁchum̐ gāga
yiṁṭigi rā kuṁḍunā yĕppuḍainānu
aṁṭida nāḍagu vachchenani vunnām̐ḍogāga
daṁṭayai yavvalibani dalam̐sunā adam̐ḍu
(||||)
tāne gadai vuṁḍe nāgu tagam̐ jana vichchum̐ gāga
mānam̐galam̐ ḍā kūḍaga mari nādonu
pānububai śhrī veṁkaḍabadi vunnāḍo kāga
yenanam̐ gā nannu nelĕ yiṁtalonĕ yadam̐ḍu